Homeజాతీయ వార్తలుBorder Infrastructure Projects: ఇక పాకిస్తాన్ చైనాకు దబిడ దిబిడే.. ఇండియా పెద్ద ప్లాన్ సక్సెస్

Border Infrastructure Projects: ఇక పాకిస్తాన్ చైనాకు దబిడ దిబిడే.. ఇండియా పెద్ద ప్లాన్ సక్సెస్

Border Infrastructure Projects: భారత్‌-పాక్‌ సరిహద్దు అంటేనే ఉద్రక్తతలకు నెలవు. పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితిలో భారత్‌.. సరిహద్దు భద్రతను మరింత పరిష్టం చేసింది. భారత్–పాకిస్థాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో 125 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తయి, వాటిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుల్లో కీలకమైన రోడ్లు, మాడ్యులర్ వంతెనలు, సొరంగాలు ఉన్నాయి, వీటి విలువ సుమారు రూ.5 వేల కోట్లు. వీటితో సైన్యం సరిహద్దుకు వేగంగా చేరుకునే అవకాశాలు మెరుగవుతాయి.

వ్యూహాత్మక ప్రాధాన్యం
1960లో స్థాపితమైన బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ గతంలో పెద్దగా పనులు చేయలేదు. తాజాగా 23 రోడ్లు, 93 వంతెనలు, 4 ఇతర ప్రాజెక్టులు సరిహద్దు రక్షణను బలపరిచే విధంగా రూపొంది ఉన్నాయి. రాజస్థాన్ నుంచి జమ్మూ కాశ్మీర్, లడ్డాక్, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులపై ఈ పనులు చేపట్టింది. హిమాలయ ప్రాంతాలలో కూడా ఇంజినీరింగ్ అద్భుతాలు చోటు చేసుకున్నాయి.

సైనిక శక్తి మరింత వేగం..
లడ్డాక్‌ ప్రాంతంలో దౌలత్‌బేగ్ నుంచి 50 కిలోమీటర్ల రోడ్డు నిర్మించడం ఎంతో కీలకం. ఈ ప్రాజెక్టు సియాచిన్ పరిస్థితులను కాపాడేందుకు సంబంధించినది. 920 మీటర్ల పొడవైన సొరంగం కూడా నిర్మించబడింది, ఇది సైన్యానికి ఏకకాలంలో వేగంగా ప్రాథమిక స్థితికి చేరుకోవడంలో సహాయపడుతుంది. ఉత్తరాఖండ్ ఖుమాయు, నార్త్ సిక్కిం, మిజోరం వంటి క్లిష్ట ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ద్వారా కేవలం సైనికుల కోసం మాత్రమే కాకుండా, ప్రజలకు కూడా నిత్యావసర సదుపాయాలు అందించడం లక్ష్యంగా ఉంది. ప్రజలు సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాల్లో నివసించడానికి వీలుగా మారింది.

పాత కాలంలో అటువంటి రోడ్లు, వంతెనలు లేకపోవడం వల్ల భారత సైన్యం సరిహద్దుకు చేరుకోవడంలో జాప్యం అయ్యేది. గత యుద్ధాలలో నష్టాలకు కారణమైంది. ఈ కొత్త నిర్మాణాలు సైన్యం వేగంగా కదలడానికి దోహదపడతాయి. తద్వారా భద్రతా పరిస్థితులను బలోపేతం చేస్తాయి. సంస్థాగత, వ్యూహాత్మకమైన అభివృద్ధులు భారత్ సరిహద్దు భద్రతలో కీలక పాత్ర పోషించనున్నాయి. భవిష్యత్తులో ఇదే విధంగా ఇతర సరిహద్దు ప్రాంతాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కొనసాగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version