కరోనా కలియుగ దైవాన్ని వదలవా?

అందులేడు ఇందులేడని సందేహంబు వలదు.. ఎందెందు వెతికినా ఆ శ్రీవారే కలడు అని ఎన్ని కీర్తనలు తిరుమలలో మారుమోగేవి. కానీ నేడు ఆ కలియుగ దైవాన్ని కూడా కరోనా పట్టేసింది. రోజుకు లక్షల మంది భక్తులతో తిరునామ స్మరణతో మారుమోగే తిరుమల ఇప్పుడు బోసిపోయింది. కోట్ల ఆదాయం, లక్షల భక్తులతో విలసిల్లే ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడి సన్నిధానం ఇప్పుడు బోసిపోయింది. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న వారి సంఖ్య తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. కేవలం 4723మంది మాత్రమే […]

Written By: NARESH, Updated On : May 5, 2021 11:55 am
Follow us on

అందులేడు ఇందులేడని సందేహంబు వలదు.. ఎందెందు వెతికినా ఆ శ్రీవారే కలడు అని ఎన్ని కీర్తనలు తిరుమలలో మారుమోగేవి. కానీ నేడు ఆ కలియుగ దైవాన్ని కూడా కరోనా పట్టేసింది.

రోజుకు లక్షల మంది భక్తులతో తిరునామ స్మరణతో మారుమోగే తిరుమల ఇప్పుడు బోసిపోయింది. కోట్ల ఆదాయం, లక్షల భక్తులతో విలసిల్లే ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడి సన్నిధానం ఇప్పుడు బోసిపోయింది.

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న వారి సంఖ్య తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. కేవలం 4723మంది మాత్రమే తిరుమలేశుడిని దర్శించుకున్నారు. కోట్ల రూపాయల ఆదాయం రోజుకు వచ్చే తిరుమలలో హుండీ ఆదాయం ఇప్పుడు రూ.39 లక్షలకు పడిపోయింది. ఇదే తిరుమలలో అత్యంత అల్పమట.. క్యూలో లక్షల మంది ఉండి రెండు రోజులు కూడా పట్టే దర్శనంలో ఇంతటి దారుణమైన స్థితికి కారణం కరోనా..

దేశవ్యాప్తంగా కరోనా కమ్మేసింది. బయటకు వస్తే పెను ప్రమాదం అని చెబుతోంది. ఎప్పుడూ భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమలను ఇలా చూడడం నిర్మానుష్యంగా కనిపించడం చూసి స్థానికులు కూడా షాక్ కు గురి అవుతున్నారు. కరోనా ఎంత పనిచేస్తివి అని ఈసడించుకుంటున్నారు.