Pervez Musharraf : అధికారం దేనికోసమైనా తెగించేలా చేస్తుంది.. ఎవరినైనా ఎదిరించేలా చేస్తుంది.. అక్రమాలకు, అనర్ధాలకు పాల్పడేలా చేస్తుంది.. ఇందుకు ఎవరూ అతీతం కాకపోయినప్పటికీ.. ఈ జాబితాలో నాలుగు ఆకులు ఎక్కువే చదివిన వాడు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్.. ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ.. కాశ్మీర్లో రక్తపు టేర్లు పారించిన నియంత.. అంతే కాదు ఉన్మాద చర్యలకు కారణమై సరిహద్దు కాశ్మీర్ ను రావణ కాష్టం చేసిన వేర్పాటు వాది.. అలాంటి మతోన్మాది దుబాయ్ లోని అమెరికా ఆసుపత్రిలో “అమిలోయిడోసిస్” వ్యాధికి చికిత్స పొందుతూ ఆదివారం దుబాయ్ లో కన్నుమూశాడు.. నా వయసు 79 సంవత్సరాలు. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పాకిస్తాన్ మీడియా ఈ వివరాలు వెల్లడించింది.. వారాల క్రితం ముషారఫ్ ఈ ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది.. ఆయన 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. ఆయన బాల్యంలో కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్ లో చదివారు.. ఆ తర్వాత లాహోర్లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత చదువులు చదివారు. ఆ తర్వాత బ్రిటన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ లో చదివారు. 1961 లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో చేరారు. 1964లో పాకిస్తాన్ ఆర్మీలో చేరారు.

ముషారఫ్ 1998 నుంచి 2007 వరకు పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా బాధ్యతలు నిర్వహించారు.. 1998 నుంచి 2001 వరకు చైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా వ్యవహరించారు. 1999 లో ఫెడరల్ ప్రభుత్వాన్ని సైన్యం కూల్చేసింది. ఆయన 2001 జూన్ 20 నుంచి 2008 ఆగస్టు 18 వరకు పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు.
1965 లో భారత్- పాక్ యుద్ధం సమయంలో ఆయన సెకండ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. 1980 వ దశకంలో ఆయన ఓ ఆర్డినరీ బ్రిగేడ్ కు చీఫ్ గా ఎదిగారు.. ఆఫ్ఘనిస్తాన్ సివిల్ వార్ లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. అంతేకాదు తాళిబన్లకు పాకిస్తాన్ మద్దతును ప్రోత్సహించారు.. 1998లో అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆయనకు ఫోర్ స్టార్ జనరల్ హోదా ఇచ్చారు. దీంతో ఆయన పాకిస్తాన్ రక్షణ దళాలకు అధిపతి అయ్యారు.
ఎప్పుడైతే ఆయనకు జనరల్ హోదా దక్కిందో అప్పుడే కాశ్మీర్లో చొరబాట్లను ప్రోత్సహించారు.. సరిహద్దు గ్రామాల్లో ఉత్పతాన్ని సృష్టించారు.. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసేవారు. అప్పటినుంచే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కట్టు తప్పడం మొదలైంది.. పైగా కాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో అమాయకులైన వారిని బందీలుగా పెట్టుకొని భారత సైన్యంపై కుట్రలు చేసేవారు.. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడేవారు.. అప్పుడు మొదలైన ఉద్రిక్తత ఇప్పటికీ చల్లారలేదు.. ముషారఫ్ తన కుటుంబాన్ని దుబాయిలో స్థిరపడేలా చేసి… అడ్డగోలుగా సంపాదించి… దానిని మొత్తం దుబాయ్ తరలించాడు. ఇక 1999లో కార్గిల్ యుద్ధం ఆయన హయాంలోనే జరిగింది.. ఇతడి నేతృత్వంలోనే కార్గిల్లోకి పాకిస్తాన్ చొరబడింది.. ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది.. షరీఫ్, ముషారఫ్ మధ్య సంబంధాలు దెబ్బ తినడంతో ముషారఫ్ ను ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించేందుకు షరీఫ్ విపలయత్నం చేశాడు. దీంతో ముషారఫ్ నేతృత్వంలోని సైన్యం తిరుగుబాటు చేసింది.. 1999లో షరీఫ్ ప్రభుత్వానికి కూల్చేసింది. 2001 లో పాకిస్తాన్ అధ్యక్ష పదవిని ముషారఫ్ చేపట్టారు. షరీఫ్ ను గృహ నిర్బంధం చేశారు.

2008 లో జరిగిన ఎన్నికల అనంతరం అభిశంసనను ఎదుర్కొన్న ముషారఫ్ దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత దుబాయ్ వెళ్లిపోయారు.. 2007లో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు ముషారఫ్ పై దేశద్రోహం కేసు నమోదయింది.. పాక్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో హత్య, రెడ్ మాస్క్ క్లరిక్ హత్య కేసుల్లో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.. ఆయన దేశం నుంచి పరారైనట్టు పాక్ ప్రకటించింది.. చికిత్స కోసం దుబాయ్ వెళ్లేందుకు 2016లో అనుమతి పొందారు. 2016 మార్చిలో దుబాయ్ వెళ్లిన తర్వాత అక్కడే ఉండిపోయారు.. అయితే షరీఫ్ ప్రభుత్వం పై తీసుకున్న చర్యలన్నీ రాజ్యాంగ విరుద్ధమని లాహోర్ హైకోర్టు 2020లో ప్రకటించింది. కానీ ఏదైతేనేం మొత్తానికి పర్వేజ్ శకం ముగిసిపోయింది.