https://oktelugu.com/

ఆచార్యలో చరణ్ లుక్ ఇదే… సోషల్ మీడియాలో వైరల్..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న చరణ్ కోలుకున్న తరువాత ఆచార్య షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. అయితే నిన్నటినుంచి ఆచార్య సినిమాలో చరణ్ లుక్ ఇదేనంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Also Read: జెట్ స్పీడ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 3, 2021 / 02:56 PM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి హీరోగా అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న చరణ్ కోలుకున్న తరువాత ఆచార్య షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. అయితే నిన్నటినుంచి ఆచార్య సినిమాలో చరణ్ లుక్ ఇదేనంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    Also Read: జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న మెగా హీరో !

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటో ఒరిజినల్ లుక్ లానే ఉండటంతో చాలామంది చరణ్ రియల్ లుక్ ఇదేనని భావిస్తున్నారు. అయితే లుక్ కు సంబంధించిన పోస్టర్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ నక్సలైట్ పాత్రను పోషిస్తుండగా ఒరిజినల్ లుక్ కూడా దాదాపు ఇదే విధంగా ఉండనుందని తెలుస్తోంది. చిరంజీవి, చరణ్ ఒకే సినిమాలో నటిస్తూ ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

    Also Read: విభిన్న తరహా కథతో సత్యదేవ్ ‘గాడ్సే’

    ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ కు జోడీగా కియారా అద్వానీ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. చిరంజీవి, చరణ్ ఇద్దరూ నటిస్తూ ఉండటంతో సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆలయ పట్టణం సెట్ వేస్తున్నారని ఈ సెట్ కోసమే 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఈ సినిమాలో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తరువాత చిరంజీవి వేదాళం, లూసీఫర్ సినిమాలలో నటిస్తున్నారు.