Dantewada Naxal Attack: కేంద్ర బలగాలు అత్యంత ఆధునికమైన ఆయుధాలు కలిగి ఉంటాయి. అడవులను జల్లెడ పడుతున్నప్పుడు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉంటాయి. ఒక ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నాయంటే దానిపై పూర్తి అవగాహన ఉన్న తర్వాతే అందులోకి దిగుతాయి. కానీ దంతేవాడ డీఆర్జీ జవాన్లపై మావోయిస్టులు విరుచుకుపడిన తీరు చూస్తుంటే ఇదేదీ ఆషామాషీ వ్యవహారం లాగా అనిపించడం లేదు. ప్రమాదం జరిగిన తర్వాత దీనికి సంబంధించిన దర్యాప్తు అధికారులు చేపట్టారు. అయితే వారి విచారణలో దిగ్బ్రాంతి కరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
పక్కా సమాచారం
అర్హదారిపై వెళ్లే వాహనాల సమాచారం పక్కాగా మావోయిస్టులకు ఎప్పటికప్పుడు చేరింది. దీంతోపాటు ఐఈడీ లను అమర్చేందుకు ప్రత్యేకంగా సొరంగం తవ్వారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా మాటు వేసి ఉన్నారు. ఈ ఘటన కంటే ముందు ఏప్రిల్ 18న గంగలూరు_ పడ్డేడ రోడ్డుపై బీజాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మండావి కాన్వాయ్ మీద మావోయిస్టులు కాల్పులు జరిపారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరు గాయపడలేదు. అయితే ఈ దాడికి వాడిన ఆయుధం మధ్యలో మొరాయించడంతో విక్రం కాన్వాయ్ దాడి నుంచి బయటపడింది. ఈ గ్రామంలో దంతెవాడ నుంచి సాధారణ పౌర వాహనాల్లో డిస్ట్రిక్ట్ గార్డ్స్ ను రప్పించి అరన్ పూర్ లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అరంపూర్ వద్ద సాయుధ మావోల సంచారం పై పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. అయితే బుధవారం ఉదయం నహడి గ్రామం వద్ద మావోయిస్టులకు, కేంద్ర పోలీసు బలగాలకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు గాయపడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ గ్రామం అరన్ పూర్ కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది.
జాగ్రత్త చర్యలు తీసుకోలేదు
మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో కేంద్ర భద్రతా దళాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఖచ్చితమైన రిపోర్ట్ అందిన తర్వాతే కూంబింగ్ లోకి దిగాలి. అంతేకాదు వారు ప్రయాణించే మార్గాన్ని కచ్చితంగా రోడ్డు ఓపెనింగ్ పార్టీ ( ఆర్వోపీ) క్షుణ్ణంగా తనిఖీ చేసి వారి కాన్వాయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. కానీ టి ఆర్ జి బృందాలు తిరిగి వచ్చే సమయంలో ఆర్వోపీ పార్టీ ఎటువంటి తనిఖీలు చేయలేదు. దీంతో గాయపడిన మావోయిస్టులను తీసుకొస్తున్న డీఆర్జీ వాహన సమాచారం లీక్ అయింది. ఈ బృందాల తొలి వాహనాల్లో అరెస్ట్ చేసిన మావోయిస్టులు ఉన్నారు. వారి వెనుక వాహనాల్లో డీఆర్జీ దళం కూడా ఉంది. వీరి వాహనాన్ని మార్గం మధ్యలో కొందరు స్థానికులు ఆపి ” ఆమ పండం” అనే వేడుకకు చందాలు అడిగారు. అక్కడ ఆపిన సమయంలో డీఆర్జీ దళాలు మాటు వేసిన సమాచారం మావోయిస్టులకు చేరింది. వెనుక ఉన్న వాహనాల్లోని డ్రైవర్ పాన్ మసాలా తినేందుకు వాహనం ఆపడం కూడా డీఆర్జీ దళం కదలికలను మావోయిస్టులకు స్పష్టంగా తెలిసేలా చేసింది. ఐఈడీ పేల్చిన తర్వాత ధ్వంసమైన వాహనం నుంచి ఆయుధాలు తీసుకునేందుకు మావోలు ప్రయత్నించారు. దీంతో వెనుక పాన్ మసాలా కోసం ఆపిన డ్రైవర్ వాహనంలోని డీఆర్జీ దళాలు మావోయిస్టుల పై కాల్పులు జరపడంతో వారు పారిపోయారు.
గంటల ముందు అమర్చారు
డీఆర్జీ దళాల పై దాడికి ముందు ఐఈడీలను అరన్ పూర్_ జగర్ గుండ కింద 24 నుంచి 48 గంటల ముందు అమర్చారు. భద్రతా దళాల ముందే సమాచారం ఉండటం తో అరన్ పూర్_ జగర్ గుండ రోడ్డు పక్క నుంచి సొరంగాన్ని తవ్వారు. అనంతరం 40 కిలోల బరువున్న ఐఈడీలను అమర్చారు. ఘటనకు రెండు రోజుల ముందు ఈ పని చేశారు. వీటిని పేల్చడానికి అనువుగా వైరును రోడ్డు పక్కన కొన్ని మీటర్ల దూరంలో పొదల వరకు విస్తరించారు. అక్కడే కాపు కాచి డీఆర్జీ వాహనాన్ని పేల్చారు.