https://oktelugu.com/

వావ్.. కరోనాకు ఫేర్ వెల్ పార్టీ.. వైరల్ వీడియో

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మరి పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు కోటిని దాటేశాయి. రోజురోజుకు కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం కరోనాను కట్టడి చేయలేక చేతులేత్తేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ దేశానికి చెందిన ప్రజలంతా రోడ్లపైకి వచ్చి కరోనా ఫేర్ వేల్ పేరుతో సామూహికంగా సంబురాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన యూరప్ లోని చెక్ రిపబ్లిక్ దేశంలో జరిగింది. పబ్జి, జూమ్.. చైనా యాప్స్ కాదట..! […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 1, 2020 / 05:14 PM IST
    Follow us on


    ప్రపంచ దేశాలు కరోనా మహమ్మరి పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు కోటిని దాటేశాయి. రోజురోజుకు కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం కరోనాను కట్టడి చేయలేక చేతులేత్తేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ దేశానికి చెందిన ప్రజలంతా రోడ్లపైకి వచ్చి కరోనా ఫేర్ వేల్ పేరుతో సామూహికంగా సంబురాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన యూరప్ లోని చెక్ రిపబ్లిక్ దేశంలో జరిగింది.

    పబ్జి, జూమ్.. చైనా యాప్స్ కాదట..!

    ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా సోకిన మాదిరిగానే యూరప్ లోని చెక్ రిపబ్లిక్ దేశానికి పాకింది. ఆ దేశ జనాభా 10.7మిలియన్లు. వీరిలో 11,960మందికి కరోనా సోకగా 7,776మంది రికవరీ అయ్యారు. 3,835మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా 349మంది మృతిచెందారు. అయితే గడిచిన కొద్దిరోజులుగా చెక్ రిపబ్లిక్ దేశంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. దీంతో ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసింది. స్థానిక ప్రజల్లో కరోనా భయాందోళన దూరం చేసేందుకు ప్రభుత్వమే సామూహిక భోజనాలు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

    కరోనాకు ఫేర్ వేల్ చెబుతూ మంగళవారం ప్రజలంతా సంబురాలు చేసుకున్నారు. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లోని మెడీవల్ చార్లెస్ బ్రిడ్జిపై సామూహిక విందు కార్యక్రమం జరిగింది. బిడ్జిపై 500మీటర్ల పొడవై టేబుల్ ఏర్పాటుచేసి ప్రజలంతా కూర్చొని భోజనం చేశారు. డ్రింక్స్ షేర్ చేసుకున్నారు. తమకు కరోనా భయం లేదని.. మమ్మల్ని కరోనా ఏమి చేయలేదని.. మనం ఇంట్లోనే ఉండిపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ పార్టీ నిర్వహించినట్లు పార్టీ నిర్వాహాకులు చెబుతున్నారు.

    టిక్ టాక్.. మనకు లాభమెంత? నష్టమెంత?

    అయితే ఆ దేశంలో పూర్తిగా కరోనా సమసిపోకముందే భారీఎత్తున పార్టీ నిర్వహించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆ దేశం కరోనా కట్టడిలోనే ఉందనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరీ వాదనలు ఎలా ఉన్నా.. కరోనా ఫేర్ వేల్ పార్టీ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.