
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో సినిమా వస్తోందంటేనే.. ఆడియన్స్ లో అంచనాలు రెట్టింపు ఆవుతాయి. మరి ఈ సారి సుక్కు ఆ అంచనాలను అందుకుంటాడా ? రాబోతున్న ‘పుష్ప’ సినిమాతో మరో భారీ హిట్ కొడతారా ? మేకర్స్ మాత్రం సినిమా పై విపరీతమైన హోప్స్ పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాకి ఏకంగా 110 కోట్లు బడ్జెట్ వేశారాట. కరోనా తరువాత కూడా బడ్జెట్ లో మార్పు లేదట. బన్నీ – సుక్కు రిస్క్ చేస్తున్నారా.. నిజానికి అంత బడ్జెట్ పెట్టి.. ఎంత గొప్పగా తీసినా.. బన్నీకి తెలుగులో, కొంతవరకు మలయాళంలో తప్ప ఇంకెక్కడా మార్కెట్ లేదు. మరి అన్ని లెక్కలు చూసుకునే భారీ బడ్జెట్ పెడుతున్నారంటే.. సినిమా పై వారికున్న నమ్మకమే కారణమేమో.
రేపు క్యాబినెట్ మీటింగ్.. హైదరాబాద్ ఖాళీ..!
ఇక ఆగస్ట్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత తక్కువ మంది సభ్యులతో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే సాంగ్స్ కి ఎక్కువ మంది డాన్సర్స్ కావాల్సి రావడం, ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి రావడంతో ముందుగా సాంగ్స్ కంటే కూడా.. తక్కువమంది ఆర్టిస్ట్ లు ఉన్న సీన్స్ నే షూట్ చేయాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేశారు.
ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్
అయితే రష్మిక మందన్న కథానాయికగా అంటేనే బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మహేష్ పక్కన రష్మిక పెద్దగా సెట్ కాలేదు. మరి బన్నీ సరసన ఎలా ఉంటుందో చూడాలి. దేవీ శ్రీ పుష్ప సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు ట్యూన్స్ కూడా ఇచ్చాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.