https://oktelugu.com/

ప్రభాస్ రెండు సినిమాల సంగతులు.. అండ్ పెళ్లి..?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణ తాలూకు ఎడిటింగ్ పనులు పూర్తి అయ్యాయని.. కొన్ని సీన్స్ కి సంబంధించిన విజువల్ ఎఫెట్స్ పనులు కూడా మొదలుపెట్టేశారని తెలుస్తోంది. లాక్ డౌన్ కి ముందు జార్జియాలో కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. అయితే కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేసింది టీం. ఆ […]

Written By:
  • admin
  • , Updated On : July 1, 2020 / 04:47 PM IST
    Follow us on


    రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణ తాలూకు ఎడిటింగ్ పనులు పూర్తి అయ్యాయని.. కొన్ని సీన్స్ కి సంబంధించిన విజువల్ ఎఫెట్స్ పనులు కూడా మొదలుపెట్టేశారని తెలుస్తోంది. లాక్ డౌన్ కి ముందు జార్జియాలో కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. అయితే కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేసింది టీం. ఆ బ్యాలెన్స్ సీన్స్ ను షూట్ చేయడం కోసమే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఓ సెట్ కి సంబంధించిన నిర్మణ పనులు శరవేగంగా పూర్తి కావస్తున్నాయి.

    ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

    ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోండగా.. ప్రభాస్ డబల్ రోల్స్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని.. ప్రభాస్ రెండు క్యారెక్టర్స్ లో ఒకటి రోమియో టైప్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలు లేకపోయినా.. సినిమా అవుట్ ఫుట్ మాత్రం అదిరిపోయేలా వస్తుందని టాక్ ఉంది.

    రేపు క్యాబినెట్ మీటింగ్.. హైదరాబాద్ ఖాళీ..!

    ప్రభాస్ ఈ సినిమా తరువాత తన తర్వాతి సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేయబోతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లనుందని.. ఈ సినిమాని కూడా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. మరి ప్రభాస్ ఈ రెండు సినిమాల తరువాత పెళ్లి చేసుకుని ఒక సంవత్సరం సినిమాలకు గ్యాప్ ఇస్తాడని అంటున్నారు.