Cyclone Dana : తుఫాన్లకు పేరు ఎలా పెడతారు.. దానా తుపాన్‌కు పేరు ఎవరు పెట్టారు.. ఏంటా కథ?

ప్రంపంచ వ్యాప్తంగా ఏటా వందల సంఖ్యలో తుపాన్లు ఏర్పడతాయి. వీటి కారణంగా భారీ వర్షాలు కురవడంతోపాటు ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. తుపాన్లకు పేర్లు కూడా పెడతారు.

Written By: Raj Shekar, Updated On : October 24, 2024 3:46 pm

Cyclone Dana

Follow us on

Cyclone Dana :  ప్రపంచ వ్యాప్తంగా ఏటా వందలాది తుపాన్లు ఏర్పడుతాయి. వివిధ దేశాలపై ఇవి విరుచుకుపడతాయి. అల్లకల్లోలం సృష్టిస్తాయి. జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతాయి. ఇండియాలో కూడా ఇప్పటి వరకు ఏర్పడిన అనేక తుఫాన్లు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. భారీగా నష్టాన్ని మిగిల్చాయి. భోలా, నిషా, తొక్తే, హుదూద్‌ వంటి సైక్లోన్లు భారత్‌లో తీవ్ర నష్టాన్ని మిగలచ్చాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దానా తుఫాను ఏర్పడింది. దీని ప్రభావం ఏపీతోపాటు ఒడిశా, పశ్చిమబెంగాల్, అసోం రాస్ట్రాలపై ఎక్కువగా ఉంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభావిత రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రకృతి వైపరీత్యాలకు పేర్లు ఎందుకు పెడతారు.. ఎవరు పెడతారు అన్న ప్రశ్న చాలామందిలో ఉంది. కానీ తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రస్తుతం దానా విజృంభిస్తున్న వేళ దానికి ఆ పేరు ఎవరు పెట్టారు. ఎందుకు పెట్టారు. దాని అర్థం ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.

తుఫాన్లకు పేరు ఎలా పెడతారు?
ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తుఫాన్లు ఏర్పడుతుంటాయి వాటికి పేర్లు పెట్టేటప్పుడు ప్రతి ప్రాంతంలోని దేశాలు కలిసి ఒక జాబితా తయారు చేస్తాయి. ఈ లిస్టులోని పేర్లను వరుసగా తుఫాన్లకు పెడతారు. హిందూ మహా సముద్రంలో, సమీప ప్రాంతాల కోసం భారత్, ఖతార్, ఇతర దేశాలుకలిసి ఓ జాబితా రూపొందించాయి. ఏ దేశం తుఫన్ల పేర్లు సజెస్ట్‌ చేసిందనేదానితో సంబంధం లేకుండా అన్ని దేశాలు లిస్టులోని పేర్లను వరుసగా పెడతాయి. తాజాగా భారత్‌లోని దానా తుపాన్‌కు ఖతార్‌ దేశం పేరు పెట్టింది. తుఫాన్లకు పేరు పెట్టే సమయంలో కొన్ని నియమాలు ఉంటాయి. అవి ఎవరినీ అవమానించకూడదు. ఏ మతం, దేశం, పొలిటికల్‌ పార్టీ లేదా పొలిటీషియన్‌ లేదా వివాదాస్పద అంశం, మహిళకు సంబంధించినదిగా ఉండకూడదు. అరబిక్‌ బాషలో దానా అంటే దాతృత్వం/దానం/దయ అని అర్థం. ఈ నియమాలను పాటిస్తూ ఖతార్‌ తాజాగా తుపానుకు దానా అని పేరు పెట్టింది.

ఈ ప్రాంత దేశాలు తయారుచేసిన జాబితాలో..
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ఈ ప్రాంత దేశాలు కలిసి ఎంపిక చేసిన పేర్ల జాబితాలోని దానా పేరును ఎంపిక చేశారు. దానా పేరును వరల్డ్‌ మెటియోరోలాజికల్‌ ఆర్గనైజేషన్, యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ ఫర్‌ ఆసియా అండ్‌ ది పసిఫిక్‌ సహకారంతో జాబితా తయారు చేశారు. ఈ పేరును ఇక ముంద ఏ తుపానుకు పెట్టరు. ఒకసారి పెట్టిన పేరు మళ్లీ పెట్టరు. దాని స్థానంలో మరో కొత్త పేరు ప్రతిపాదిస్తారు.

2000 నుంచి పేర్లు..
ఇక డబ్ల్యూఎంవో, ఈఎస్‌సీఏపీ సంస్థల కింద ప్రపంచంలోని వివిధ దేశాలు కలిసి తుఫాన్లకు పేర్తు పెట్టే పద్ధతిని 2000లో ప్రారంభించాయి. మొదట్లో బంగ్లాదేశ్, భారత దేశం, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలు మాత్రమే ఈ పద్ధతిలో పాల్గొన్నాయి. 2018 నుంచి ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్‌ దేశాలు కూడా ఈ జాబితాలో చేరాయి. 13 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఒక్కో దేశం 13 పేర్లు సూచిస్తాయి. వీటన్నింటినీ కలిపి 169 పేర్ల .ఆబితా తయారు చేశారు. భారత వాతావరణ శాఖ 2020 ఏప్రిల్‌లో ఈ జాబితాను విడుదల చేసింది. రెండు నెలల వ్యవధిలో దానా తుఫాను భారతదేశం తీరాన్ని తాకిన రెండో తుఫాన్‌ అయింది. దీనికి ముందు ఆగస్టులు అస్నా తుఫాను తీరానికి వచ్చింది.