South Africa Vs Bangladesh: బంగ్లాదేశ్ పై సాధించిన విజయంతో దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆసియాలో సౌత్ ఆఫ్రికా నిజాన్ని సాధించడం విశేషం. చివరిసారిగా 2014లో గాలే వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా శ్రీలంకపై విజయం సాధించింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు మరొక విజయాన్ని సొంతం చేసుకుంది. 2008 తర్వాత బంగ్లాదేశ్ జట్టుపై టెస్ట్ మ్యాచ్ విజయం సాధించడం దక్షిణాఫ్రికాకు ఇది తొలిసారి. నాలుగో రోజు ఆటను 283/7 తో ప్రారంభించిన బంగ్లాదేశ్ 307 పరుగులకు ఆలౌట్ అయింది. హసన్ మీర్జా 97 పరుగులు చేసి.. చివరి వికెట్ గా అవుట్ అయ్యాడు. రబాడ ఆరు వికెట్లు సాధించాడు. మహారాజు మూడు వికెట్లు దక్కించుకున్నాడు. ముల్డర్ ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు.
స్వల్ప లక్ష్యంతో..
బంగ్లాదేశ్ 307 పరుగులు చేసినప్పటికీ.. దక్షిణాఫ్రికా ఎదుట 106 రన్స్ టార్గెట్ మాత్రమే విధించింది. ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. టోనీ 41, స్టబ్స్ 30*, మార్క్ రం 20 పరుగులతో సత్తా చాటారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.. అయితే బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 106 పరుగులకు కుప్పకూలింది. మహమ్మదుల్ హసన్ చేసిన 30 పరుగులే ఆ జట్టులో టాప్ స్కోర్. రబాడ, ముల్డర్, మహారాజ్ తలా మూడు వికెట్లు సాధించారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 308 రన్స్ చేసింది. వేరియన్ 114, ముల్డర్ 54 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు సాధించాడు. హసన్ మహమ్మద్ మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. అయితే ఈ విజయం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ టేబుల్ లో గణాంకాలు పూర్తిగా మారిపోయాయి. 47.62 విన్నింగ్ పర్సంటేజ్ తో సౌత్ ఆఫ్రికా నాలుగో స్థానానికి ఎగిసింది. ఫైనల్ బెర్తులో తను కూడా ఒక పోటీదారుగా నిలిచింది. భారత్ 68.06 విన్నింగ్ పర్సంటేజ్ తో మొదటి స్థానంలో, ఆస్ట్రేలియా 62.50 పర్సంటేజ్ తో రెండవ స్థానంలో, శ్రీలంక 55.56 పర్సంటేజ్ తో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. బెంగళూరు టెస్ట్ లో భారత్ పై గెలిచినప్పటికీ న్యూజిలాండ్ 44.44 పర్సంటేజ్ తో ఐదో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ 43.06 విన్నింగ్ పర్సంటేజ్ తో ఆరో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 30.56, పాకిస్తాన్ 25.93, వెస్టిండీస్ 18.52 విన్నింగ్ పర్సంటేజీలతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.