దూసుకొస్తున్న ఎంఫాన్ తుఫాన్!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఎంఫాన్ తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎంఫాన్  తుఫాన్ మరింత బలపడటంతో పెద్ద పెద్ద ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలలోనూ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుఫాన్ వల్ల ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 1:38 pm
Follow us on

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఎంఫాన్ తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎంఫాన్  తుఫాన్ మరింత బలపడటంతో పెద్ద పెద్ద ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలలోనూ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుఫాన్ వల్ల ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

మే 20వ తేదీ మధ్యాహ్నానికి  హతియా దీవులు, సాగర్ ద్వీపాల మధ్య తుఫాను తీరం దాటి భారత్ ను తాకనుంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.