https://oktelugu.com/

షాకింగ్ న్యూస్: చెన్నై, విశాఖ మునిగిపోతుందట..

పర్యావరణ ముప్పు ప్రపంచానికి పొంచి ఉంది. గ్లోబల్ వార్మింగ్ తో దేశాలు కుదేలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హిమనీ నదాలు కరిగి సముద్రాల మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. దీంతో ప్రపంచంలోని తీర ప్రాంతాలు ప్రమాదానికి గురయ్యే వీలుంది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల ఫలితంగా ఈ ఉత్పాతాలు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. భారత్ లోని 12 తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు మూడు మీటర్ల మేర సముద్రంలో మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 10, 2021 / 05:39 PM IST
    Follow us on

    పర్యావరణ ముప్పు ప్రపంచానికి పొంచి ఉంది. గ్లోబల్ వార్మింగ్ తో దేశాలు కుదేలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హిమనీ నదాలు కరిగి సముద్రాల మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. దీంతో ప్రపంచంలోని తీర ప్రాంతాలు ప్రమాదానికి గురయ్యే వీలుంది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల ఫలితంగా ఈ ఉత్పాతాలు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. భారత్ లోని 12 తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు మూడు మీటర్ల మేర సముద్రంలో మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది.

    ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఊద్గారాల వల్ల పర్యావరణం ఎప్పుడో కలుషితం అయిపోయింది. ఓజోన్ పొర దెబ్బతింది. ఫలితంగా వేడి పెరుగుతోంది. ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అతివృష్టి, అనావృష్టి మానవాళిపై పెను ప్రభావం చూపనున్నాయి. వాతావరణ మార్పులపై అధ్యయనం చేసిన నాసాకు చెందిన అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ రూపొందించిన నివేదిక భారత్ వంటి దేశాల్లో గుబులు రేపుతోంది.

    ప్రపంచంలో 71 శాతం నీరు 29 శాతం భూభాగం ఉంది. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరగడం ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. భూతాపంతో హిమనీ నదాలు కరిగి ఉపద్రవం ముంచుకొచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. ఐపీసీసీ నివేదిక ప్రకారం భారత్ వంటి దేశాల్లో దీని ప్రభావం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి చెందిన నగరాలతో వాతావరణంలో భారీ మార్పులు ఖాయమని తెలుస్తోంది.

    ఈ శతాబ్దం అంతమయ్యే నాటికి ఏపీలోని విశాఖపట్నం సహా 12 నగరాలు 3 అడుగుల మేర సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉందని నాసాకు చెందిన ఐపీసీసీ నివేదిక తెలిపింది. ఇందులో ముంబై, చెన్నై, కొచ్చి, కాండ్లా, ఓఖా, భావ్ నగర్, మంగళూర్ మార్మగోవా, పారాదీప్, ఖిధిర్, పూర్, ట్యుటికోరిన్ ఉన్నాయి. 2006 నుంచి 2018 మధ్య సాగిన ఓ అధ్యయనం ప్రకారం అంతర్జాతీయంగా సముద్ర మట్టాలు ఏడాదికి 3.7 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతాయని చెప్పింది.