Lokesh Yuvagalam Padayatra
Lokesh Yuvagalam Padayatra: లోకేషం మళ్లీ దొరికేశాడు. నోరు తీరగక ఏవేవో మాట్లాడి అడ్డంగా బుక్కవుతున్నాడు. సున్నితమైన పదాలు కూడా పలకలేక ముప్పు తిప్పలు పడుతున్నాడు. తాజాగా నెల్లూరు జిల్లాలో ధాన్యం మద్దతు ధర విషయంలో లోకేష్ మాటలు బూతు పదాలుగా మారిపోయాయి. దానిని సరిచేసేందుకు ఆపసోపాలుపడిన లోకేషం సర్దిచెప్పడంతో అక్కడున్న టీడీపీ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బూతులు మాట్లాడుతున్న పప్పు అంటూ వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. పోస్టులు, కామెంట్లతో నింపేస్తోంది.
ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. మొన్నటివరకూ రాయలసీమలో యాత్ర సాగినప్పుడు లోకేష్ పర్వాలేదనిపించారు. అయితే నెల్లూరుకు వచ్చేసరికి తడబడుతున్నారు. మొన్న ఆ మధ్యన ఓ బహిరంగ సభలో బ్రాహ్మానందం నత్తి తరహాలో మాట్లాడి నవ్వులపాలయ్యారు. రైతుల గాయంపై ప్రభుత్వం కారం చల్లుతోందని చెప్పడానికి తెగ కష్టపడిపోయారు. ‘రైతు గాయం కారం.. రైతు గాయంపై కారం.. రైతు గాయంపై కారం’ అంటూ అదే మాటను మూడుసార్లు చెప్పుకొచ్చారు. దానికి కొనసాగింపుగా ఏ పదం వాడాలో కూడా తెలియని తెలుగు భాషా పఠిమ మన లోకేషంది అని అక్కడున్న వారందరికీ అర్థమైపోయింది. చివరకు ఒక క్షణం అంటూ సభికుల అనుమతి తీసుకొని పేపర్ అందుకున్నారు. పేపరు చదివి ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో సభికులు లోలోపల నవ్వుకున్నారు.
అయితే తాజాగా మరో సభలో ధాన్యం మద్దతు ధర విషయమై లోకేష్ అదే రీతిలో మాట్లాడాడు. ఒక్కో పుట్టి ధాన్యం కొనుగోలులో రూ.5 వేల నష్టం రైతుకు జరిగిందని చెప్పడానికి ఆపసోపాలు పడ్డాడు. బూతుపదం ధ్వనించేలా మాట్లాడాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు అదే వ్యాఖ్య చేశాడు. చివరకు ఎలాగాలో అసలు పదాన్ని అందుకొని ప్రసంగాన్ని ముగించాడు. అయితే పేపరు ముందు పట్టుకొని సైతం లోకేష్ తత్తరపాటుకు గురిచేయడం అక్కడున్న వారికి నవ్వు తెప్పించింది. బ్రహ్మానందం తరహాలో నవ్వు ఆపుకుంటున్నావు కదరా అన్న కామెడీ కామెంట్ గుర్తుకొచ్చింది. అయితే తన భాషా ప్రావీణ్యంతో లోకేషం మాత్రం నెల్లూరు జిల్లా ప్రజలకు తెగ వినోదం పంచగలుగుతున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.