SV Ranga Rao Birth Anniversary
SV Ranga Rao Birth Anniversary: గాంభీర్యాగ్రహం.. హస్య చతురత.. గుండెల్ని పిండేసే సెంటిమెంట్.. ఇలా ఎటువంటి సీన్లలోనైనా విలీనమయ్యే ఆ నటుడు ఇప్పటికీ ప్రత్యేకమే. నటనా మెళకువలు ఏమాత్రం తెలియని ఆయన ఆరోజుల్లోనే నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ప్రేక్షకులకు వినోదాన్నిపంచడానికి దివి నుంచి భువికి వచ్చిన ఘటోత్కచుడా..!! అనేంతగా తన ఆ పాత్రలో జీవించాడు. ఆయన మన మధ్యలేకున్నా ఆయన నటించిన చిత్రాలో ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నటుడు అని ఆశ్చర్యపోతున్నారా? ఇంకెవరు…? సుప్రసిద్ధ నటుడు ఎస్వీ రంగారావు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిని ఎస్వీ రంగారావు యాక్టర్ కాదు… ఆ పాత్రలో జీవించే అసాధరణ నటుడు అని సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు కీర్తిస్తారు. ఎస్వీ రంగారావు 1918 జూలై న జన్మించారు. ఆయన జయంతి సందర్భంగా కొన్ని ఆసక్తి విషయాలు మీకోసం..
ఎస్వీ రంగారావు కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన చదువుకునే రోజుల నుంచి నాటకాల్లో పాల్గొనేవారు. ఆ తరువాతఫైర్ ఆఫీసర్ గా ఉద్యోగంలో చేరారు. అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో తన ఉద్యోగానికి రాజీనామా చేవారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే తొలి చిత్రం ఆశించినంతగా విజయం సాధించలేదు. దీంతో ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ఆయన జీవితాన్ని గడిపేందుకు జమ్ షెడ్ పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగంలో చేరారు. అయితే ఎ సుబ్బారావు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘పల్లెటూరి పిల్ల’ అనే సినిమా కోసం ఎస్వీ రంగారావుకు పిలుపు వచ్చింది.
ఇక అప్పటి నుంచి ఎస్వీఆర్ దశ తిరిగిందనే చెప్పవచ్చు. ఆ తరువాత మూడు దశబ్దాలుగా వివిధ పాత్రల్లో నటించారు. అయితే ప్రతినాయక పాత్రలతో పాటు ఘటోత్కచుడు పాత్రలో ఎస్వీఆర్ కు గుర్తింపు వచ్చింది. 1951లో వచ్చిన పాతాళ బైరవి పాత్రను ఎస్వీ రంగారావుకు ఇచ్చారు. అయతే ఈ సమయంలో కొందరు నిర్మాతలు కొత్త నటుడికి ఇలాంటి కీలక పాత్ర ఎలా ఇస్తారని హెచ్చరించారు. కానీ రంగారావు తన పాత్రలో ఇమిడిపోయి దానికి న్యాయం చేశారు. ఇక 1955లో బంగారు పాప ఆనే చిత్రంలో నటనకు ఎస్వీ రంగారావును అప్పటి గుమ్మడి ప్రత్యేకంగా అభినందించారు. ఎస్వీరంగారావు మనదేశంలో పుట్టడం అదృష్టం అని అన్నారు.
రంగారావు నటుడిగానే కాకుండా కొన్ని సినిమాలకు డైరెక్షన్ చేశాడు. ఆయన డైరెక్షన్లో వచ్చిన మొదటి చిత్రం చదరంగం. ఈ సినిమా ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. రెండో చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. నర్తన శాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివెల్ లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. మన దేశంలో రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నాడు. ఆయన నటనకు గుర్తుగా 2013లో భారత సినీ పరిశ్రమ వందేళ్ల సందర్భంగా తపాలా బిల్లను విడుదల చేశారు.
సినీ జీవితంలో విశ్వనటచక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ, నటశేఖర బిరుదులు పొందిన ఎస్వీ రంగారావు చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 1974లో హైదరాబాద్ లో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. అనారోగ్యంతో ఉన్నా చక్రవాకం, యశోధ కృష్ణ అనే సినిమాలు తీశారు. ఆ తరువాత బైసాప్ సర్జరీ కోసం ఆమెరికా వెళ్లారు. కానీ అంతలోనే 1974 జూలై 18న మరోసారి గుండెపోటు రావడంతో మరణించాడు. ఆయన మరణాంతరమూ రంగారావును సినీ ఇండస్ట్రీ గుర్తుపెట్టుకంది. 2018 జూలైలో రంగారావు జయంతి ఉత్సవాలను నిర్వహించింది. 2018 జూలై 3న ఏలూరులో రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు.