India Debt 2023: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది మోదీ సర్కార్ వ్యవహార శైలి. ప్రపంచంలో భారత్ వెలిగిపోతోంది అని ఒక వైపు ప్రచారం చేస్తుండగా… మరోవైపు మాత్రం మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బడి ముబ్బడి అప్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ ఏజెన్సీలు సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.భారత అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. జిడిపిలో ప్రభుత్వ అప్పులు 100 శాతానికి మించొద్దని హెచ్చరించింది. దీర్ఘకాల అప్పుల పర్యవసానాలను ఎదుర్కోవడానికి గణనీయమైన పెట్టుబడులు అవసరమని కూడా స్పష్టం చేయడం విశేషం.
అంతర్జాతీయ వృద్ధి మందగించితే మాత్రం.. అది భారత వాణిజ్యం పై విశేషంగా ప్రభావం చూపుతుంది. ఎగుమతి, దిగుమతుల్లో లోపాలు తలెత్తితే ఆర్థిక సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉంది. భారత్ పై అన్ని విధాల ఒత్తిడి పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2005 నాటికి భారత జిడిపిలో అప్పులు 81% ఉండగా.. 2020 నాటికి 84 శాతానికి పెరిగింది.. ఆ తరువాత 81 శాతానికి తగ్గింది.ప్రస్తుతానికి పర్వాలేకున్నా భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం భారత్ ప్రమాదకర స్థితిలో పడినట్టే. కేంద్రంలోని మోడీ సర్కార్ ఇటీవల అడ్డగోలుగా అప్పులు చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశ అప్పు రూ. 25 లక్షల కోట్లు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి రూ.200 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. అంటే మూడు నెలల వ్యాధిలో ఐదు లక్షల కోట్ల అప్పులు చేసినట్లు అయ్యింది.
గత పదేళ్ల ఎన్డీఏ పాలనలో చాలా రంగాల్లో మోడీ సర్కార్ పురోగతి సాధించింది. ప్రపంచంలో బలమైన దేశంగా ఇండియా రూపుదిద్దుకుంది. అగ్రదేశాల సరసన నిలిచింది. కానీ ఆర్థికంగా గుర్తింపు ఉంటేనే దానికి సార్ధకత చేకూరేది. వాణిజ్య, వర్తక రంగాల్లో అభివృద్ధి సాధిస్తేనే దేశ ఆర్థిక స్థితి మెరుగుపడేది. ఒక విధంగా మోడీ సర్కార్ నేల విడిచి సాము చేస్తుందన్న విమర్శ ఉంది. తాము ఈ దేశానికి పాలిస్తున్నామన్న సంగతి మరిచి.. తమ పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం మాత్రం లోపంగా మారుతుంది. దేశ స్థూల ఆదాయం పెరగాలంటే.. అన్ని రాష్ట్రాలను సమగ్ర పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంతర్జాతీయ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. ఆర్థిక సమతూకం పాటించడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ అవసరం కూడా అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ స్థిరత్వం కోసం దేశ ఆర్థిక అభివృద్ధికి చెట్టు తెప్పించే ఎటువంటి నిర్ణయాలు తీసుకునన్నా అది అంతిమంగా దేశానికి నష్టమని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక తేల్చుకోవాల్సింది మోడీ సర్కారే.