ఏపీలో కర్ఫ్యూ: ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్

దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసానికి జగన్ ఒడిగట్టాడు. ఏపీ ప్రజలకు ఇంతటి కరోనా కల్లోలంలో గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా టీకాల వ్యాక్సినేషన్ విషయంలోనూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత కరోనా టీకా వేయాలని నిర్ణయిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ఏపీలో 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు […]

Written By: NARESH, Updated On : April 23, 2021 6:26 pm
Follow us on

దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసానికి జగన్ ఒడిగట్టాడు. ఏపీ ప్రజలకు ఇంతటి కరోనా కల్లోలంలో గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా టీకాల వ్యాక్సినేషన్ విషయంలోనూ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత కరోనా టీకా వేయాలని నిర్ణయిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ఏపీలో 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.

శుక్రవారం మంత్రులు, అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ సరఫరా విషయమై సీఎం జగన్ ఇప్పటికే భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్ ఎండీలకు ఫోన్ చేసి మాట్లాడారు.

కరోనాను నియంత్రించాలంటే ఒక్క వ్యాక్సిన్ మాత్రమే మంత్రం అని.. అందుకే ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కు మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇందులో భాగంగానే 18 ఏళ్లు దాటిన ఏపీ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు.

ఇక ఈ వ్యాక్సినేషన్ కోసం ఏపీ ప్రభుత్వం 1600 కోట్ల నిధులు వెచ్చించి ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు.

*ఏపీలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ
ఇక శనివారం నుంచి ఏపీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.ఇక ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై దృష్టిసారిస్తామని.. సిటీ స్కాన్ సహా కరోనాకు అధిక ఫీజులు వస్తే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.