ఇంతకీ ఆ రోగి ఎవరంటే.. నాగ్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల భారతి అనే యువతి. ఆమె కరోనా సోకి 80 శాతం ఊపిరితిత్తులను కోల్పోయింది. ఇప్పుడున్న ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమె బ్రతకాలి అంటే.. హైదరాబాద్ లో ఉన్న అపోలోకి తీసుకొచ్చి ఆమెకు ఎక్మో చికిత్స అందించాలి. అందుకే సోనూ సూద్ ఆమె ప్రాణాలను కాపాడాలని, ఆమెను నాగ్ పూర్ నుండి హైదరాబాద్ తీసుకురావడానికి ఎయిర్ అంబులెన్స్ బుక్ చేశాడు. భారతిని హైదరాబాద్ తీసుకురావడమే కాకుండా ఆమెను అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేసి.. ఆమెకు చికిత్స జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాడు. సోనూ సూద్ చేసిన మంచి పనికి అయినా ఆమె పూర్తిగా కోలుకుంటుందని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇటీవలే కరోనా బారిన పడిన సోనూ సూద్ కోలుకున్నారు. తాజా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఏది ఏమైనా సోనూ సూద్ చేసిన మంచిపనులను చూసి, దేశం మొత్తం ఆయనని అభిమానించటం స్టార్ట్ చేసింది. లాక్ డౌన్ సమయంలో బ్రతుకుదెరువు కోసం , ఉన్నత చదువుల కోసం వేరే సిటీలకు వెళ్ళినవారు అలాగే కూలీలు రోడ్ల మీద ఇరుక్కిపోతే వాళ్లతో పాటు వలస కార్మికులను కూడా సొంత ఊళ్ళకి పంపాడు సోనూ. అలాగే ఉద్యోగం పోయి రోడ్డున పడిన వారికి ఉద్యోగం ఇప్పించటం, ఇలా అనేక మందికి అనేక విధాలుగా సోనూ సాయం చేస్తూ ముందుకు పోతున్నాడు. అందుకే సోనూ సూద్ ను ‘కలియుగ కర్ణుడు’ అంటూ అభినందిస్తున్నారు.