KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార బీఆర్‌ఎస్‌ను ఓడించారు. హ్యాట్రిక్ విజయం సాధించి.. రాజకీయ చరిత్రను తిరగ రాస్తామని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రకటించారు. కానీ ఓటర్ల తీర్పు ఇందుకు విరుద్ధంగా వచ్చింది. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. ఫలితాలు వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు. వాస్తవంగా బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. పట్టణ ఓటర్లు బీఆర్‌ఎస్‌కే మద్దతుగా నిలిచారు. రంగారెడ్డి, హైదరాబాద్ ఓటర్లు బీఆర్‌ఎస్‌కే ఓట్లు వేశారు. కానీ, కేసీఆర్ అధికారంలో ఉండగా చేసిన పొరపాటునే ఓడిన తర్వాత చేశారు.
ఫామ్‌హౌస్ సీఎంగా..
కేసీఆర్‌కు తెలంగాణలో ఫామ్‌హౌస్ సీఎంగా ముద్రపడింది. అధికారంలో ఉన్నన్నినాళ్లు సచివాలయానికి రాలేదు. కొత్త సచివాలయం నిర్మిచంకున్నా.. కొటి రెండుసార్లు మాత్రేమ వచ్చారు. అధికార యంత్రాంగాన్ని తన ఫామ్ హౌస్‌కు రప్పించుకోవడం, మంత్రివర్గ సమావేశాలు కూడా ఫామ్‌హౌస్‌లో నిర్వహించడంతో ప్రజలు కూడా ఫామ్‌హౌస్ సీఎం అని ఫిక్స్ అయ్యారు. కాళేశ్వరం నీళ్లు ఫామ్‌హౌస్‌కు మళ్లించారని, నాణ్యతలోపంతో నిర్మించి కమీషన్లు దండుకున్నారని నమ్మారు. దీంతో గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించారు. అయితే ఓడిన తర్వాత వైఫల్యాలపై సమీక్ష చేసుకోవాల్సిన కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లడం ఇప్పుడు క్యాడర్‌లో ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బతీసింది.
ఇలా ఉంటే కష్టమే..
పార్టీ అధినేతగా క్యాడర్‌తో ధైర్యం నింపాల్సిన నేత.. ఫామ్‌హౌస్‌కు పరిమితం కావడంపై విమర్శలు వస్తున్నాయి. కనీసం బీఆర్‌ఎస్ భవన్‌కు కూడా రావడం లేదు. గెలిచిన, ఓడిన ఎమ్మెల్యేలను తన ఫామ్‌హౌస్‌లోనే కలుస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్‌లో ఆందోళన నెలకొంది. అయినా ఇవేమీ పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. ఈతరుణంలో కేసీఆర్ బయటకు రావాల్సిన అవసరం ఉంది. చేసిన పొరపాట్లు ఇకపై చేయమని ప్రజలవద్దకు వెళ్లాలి. లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరాలి. అప్పుడే బీఆర్‌ఎస్‌కు ఆదరణ పెరుగుతుంది. లేని పక్షంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయి.
లోక్‌సభ ఎన్నికల్లో ఓడితే..
ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఓడితే బీఆర్‌ఎస్ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత రాజకీయ ఉనికి కోలోపవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కనీసం పది స్థానాలు గెలిస్తేనే వచ్చే ఐదేళ్లలో బీఆర్‌ఎస్ ఉనికి ఉంటుంది. రెండు మూడు గెలిస్తే.. కేసీఆర్ శాశ్వతంగా ఫామ్‌హౌస్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Criticism is coming for kcr being confined to the farmhouse
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com