Homeఆంధ్రప్రదేశ్‌పొత్తుల పొడుపు.. విశ్వసనీయతే బాబు మైనస్

పొత్తుల పొడుపు.. విశ్వసనీయతే బాబు మైనస్

Chandrababuతెలుగుదేశం పార్టీ అధినేత తన విశ్వసనీయత నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయనకు వచ్చే ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్నారు. విజయం దక్కాలంటే పొత్తుల వల్లనే సాధ్యం కాదని ప్రజల్లో విశ్వసనీయత లేకపోతే ఎవరితో పొత్తు పెట్టుకున్నా గెలుపు అంత సులభం కాదనే విషయం స్పష్టమవుతోంది. ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమమే కాకుండా తనపై నమ్మకం కలిగించే విధంగా చంద్రబాబు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది.

చంద్రబాబుకు 2024 ఎన్నికలు ఓ పరీక్షగా భావించుకోవాలి. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తున్నా పొత్తులు విజయవంతం అవ్వాలంటే ప్రజలకు నమ్మకం కలిగించాలి.2018 ఎన్నికల్లో తెలంగాణలో అన్ని పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పడినా ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకువాలని పార్టీ సీనియర్ నేతలు సైతం చెబుతున్నారు.

ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. దాన్ని తన పరం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. జగన్ మీద అవినీతి ఆరోపణలు చేసి లాభం లేదు. ఫ్యాక్షనిస్టు ముద్ర వేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే అవి జనం పలుమార్లు విని విసిగిపోయారు. తన రాజకీయ అనుభవంతో ఆంధ్రప్రదేశ్ ను ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలకు విడమర్చి చెప్పగలగాలి.

అమరావతి రాజధానిని చూపెడితే జనం అంగీకరించరు. తాను అధికారంలోకి వస్తే పారిశ్రామికాభివృద్ధి తోపాటు సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు ఏ విధంగా అందిస్తారో చెప్పాలి. చంద్రబాబు తన పంథా మార్చుకుని ప్రజలకు అవగాహన కలిగించేలా తన పథకాల తీరుతెన్నుల గురించి క్షుణ్ణంగా విశదీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version