తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్ అనేది ఆనవాయితీ అయిపోయింది. సినిమాకు క్రేజ్ పెరగాలంటే.. ఐటమ్ సాంగ్ సూపర్ హిట్ అవ్వాలి. అందుకే, ‘పుష్ప’, “సలార్’ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో కూడా స్పెషల్ ఐటమ్ సాంగ్స్ ను డిజైన్ చేశారు మేకర్స్. అలాగే, ‘ఎఫ్ 3’లో కూడా ఒక ప్రత్యేకమైన ఐటమ్ స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి.
నిజానికి తమన్నా, మెహ్రీన్ వంటి గ్లామర్ భామలు బికినీల్లో కావాల్సినంత గ్లామర్ ఒలకబోయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళ చేత ఎలాగూ ఒక సాంగ్ లో బికినీ వేయించి రచ్చ చేయడానికి అనిల్ ఆల్ రెడీ ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ సెట్ చేశాడు. కానీ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఓ ఐటమ్ సాంగ్ కోసం ఇప్పుడు హీరోయిన్ని సెట్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
ఈ స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్న రావిపూడి, ఈ క్రమంలో పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించాడు. అయితే అందరి హీరోయిన్స్ లో అనిల్ కి ప్రగ్యా జైస్వాల్ అయితే బాగుంటుంది అనిపించింది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ తో చర్చలు జరిపారు. ఈ అమ్మడు కూడా సులువుగానే ఒప్పుకుంది. కానీ ఇప్పుడు ఈ సాంగ్ చేయడానికి అఖండ టీమ్ ఒప్పుకునేలా లేదు.
ఎందుకంటే ‘అఖండ’లో ఆమె మెయిన్ హీరోయిన్. తమ హీరోయిన్ ఒక కామెడీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తే.. తమ సినిమా స్థాయి తగ్గినట్టే అని బాలయ్య ఫీల్ అయ్యాడట. అందుకే, ప్రగ్యాకి బాలయ్య సీరియస్ గా చెప్పాడు. మా సినిమా రిలీజ్ అయ్యే వరకు ఐటమ్ సాంగ్ లు చెయ్యొద్దు అని కండిషన్ పెట్టాడు. మొత్తానికి బాలయ్య ఎఫ్ 3కి ఐటమ్ భామను దూరం చేశాడు.