https://oktelugu.com/

CPI Narayana With RK: కేసీఆర్ ను నమ్మి అనుభవించా.. జగన్ కుర్రాడు ఆ తప్పు చేశాడు.. నారాయణ సంచలనాలు

CPI Narayana Open Heart With RK : సీపీఐ నారాయణ మరోసారి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. కమ్యూనిస్టు నాయకుడంటే నెరిసిన గడ్డం.. మాసిన చొక్కాలు వేసుకునే రోజులు పోయాయని.. తాను కూడా ఇస్త్రీ బట్టలు వేసుకొని కొత్త రాజకీయం చేస్తానని నారాయణ ‘మోడ్రన్ కమ్యూనిస్టు’ను ఆవిష్కరించారు. చిన్న జీయర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకూ తమకూ కమ్యూనిస్టు భావాలు ఉన్నాయంటారని.. కమ్యూనిజానికి అంతం లేదని.. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 4, 2022 / 05:19 PM IST
    Follow us on

    CPI Narayana Open Heart With RK : సీపీఐ నారాయణ మరోసారి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. కమ్యూనిస్టు నాయకుడంటే నెరిసిన గడ్డం.. మాసిన చొక్కాలు వేసుకునే రోజులు పోయాయని.. తాను కూడా ఇస్త్రీ బట్టలు వేసుకొని కొత్త రాజకీయం చేస్తానని నారాయణ ‘మోడ్రన్ కమ్యూనిస్టు’ను ఆవిష్కరించారు.

    చిన్న జీయర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకూ తమకూ కమ్యూనిస్టు భావాలు ఉన్నాయంటారని.. కమ్యూనిజానికి అంతం లేదని.. కేవలం పార్టీకి గెలుపు అవకాశాలు లేకపోవచ్చని నారాయణ అభిప్రాయపడ్డారు.

    అనవసరంగా ఈ పార్టీలోకి వచ్చానని ఎప్పుడూ అనిపించలేదని.. మరీ తప్పుగా అనిపిస్తే దండం పెట్టి బయటకు వచ్చేవాడినని కమ్యూనిస్టు పార్టీలోని లోతుపాతులను నారాయణ చెప్పుకొచ్చారు. స్వరూపానందకు కూడా దండం పెడితే తనకు భక్తి ఎక్కువ అని కమ్యూనిస్టునేనా? అని రచ్చ చేశారని నారాయణ చెప్పుకొచ్చారు.

    నారాయణ చాలా వివాదాస్పద వ్యక్తి అని ఆయనే ఒప్పుకోవడం విశేషం. బిగ్ బాస్ ను ‘బ్రోతల్ హౌస్’ అనడానికి కారణాన్ని నారాయణ బయటపెట్టాడు. ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావ్? ఏ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటావ్ అని నాగార్జున అడిగాకే తాను అలా అన్నానని.. నాగార్జునపై కూడా గౌరవం పోయిందని.. అసహ్యమేసిందని నారాయణ విమర్శించారు.

    జగన్ ను పట్టుకొని వాడు రాక్షసుడు.. వాడు మూర్ఖుడు.. వాడు వినడు అని కొందరు ఆయన సన్నిహితులు నాకు చెప్పారని నారాయణ సంచలన కామెంట్స్ చేశారు.దీనికి ఆర్కే ఆ రెండోదే రైట్ అని బలపరచడం విశేషం.

    జగన్ మోహన్ రెడ్డి కుర్రోడని.. ఇంకా అనుభవించాల్సింది చాలా ఉందని.. రాక్షసత్వం తగ్గించి హ్యూమానిటీ పెంచాలని నారాయణ సూచించారు. ఈయనా మన ముఖ్యమంత్రి అని అసహ్యించుకునేలా పరిస్థితి ఎందుకొచ్చిందని అనుకునేలా చేయవద్దని నారాయణ చెప్పుకొచ్చాడు.

    జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ తో కలిసి మా పార్టీ నేను ఉద్యమించానని.. కానీ ఆయనతో తిరిగాక.. ఆయనను ఎంత వరకూ నమ్మాలో నమ్మకూడదో నేను అనుభవించేశానని నారాయణ కామెంట్ చేశారు.కేసీఆర్ ను మా పార్టీ నమ్ముతుందో నమ్మదో వాళ్ల ఇష్టమన్నారు.

    చంద్రబాబులో భయం ఉందని.. జైలుకు పంపిస్తారన్న భయం వీడితే గొప్ప నాయకుడు కావచ్చని నారాయణ అన్నారు. 50 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీలో చేసిన నారాయణ ఆపార్టీకి భవిష్యత్తు ఉందా? ఈ దేశంలో అంటే మౌనం దాల్చారు. ఆయన ఏం సమాధానం ఇచ్చారన్నది ఆసక్తిగా మారింది. ఆ ఫుల్ ఎపిసోడ్ ను ఈ ఆదివారం చూడాల్సిందే.