CPI Narayana Comments On Bigg Boss 6: భారతదేశంలో బిగ్ బాస్ షోని సాంప్రదాయ వాదులు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. ఆడ, మగా ఒక ఇంటిలో ఉండడం, కెమెరా ముందే ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోవడం కొందరికి నచ్చడం లేదు. భారతీయ సాంప్రదాయానికి విరుద్ధమైన ఈ షో సమాజంపై చెడు ప్రభావం చూపిస్తుందని సీపీఐ నారాయణ లాంటి రాజకీయ నాయకులు కూడా గట్టిగా వాదిస్తున్నారు.

ఫలితంగా తెలుగులో కూడా బిగ్ బాస్ షోపై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. నిజానికి బిగ్ బాస్ సీజన్ 3కి ముందు… షో ఆపేయాలని కొందరు ఆందోళనలు చేశారు. బిగ్ బాస్ సీజన్3 హోస్ట్ నాగార్జున అని తెలుసుకున్న విద్యార్థులు ఆయన ఇంటి ముందు ఆందోళన చేయడం జరిగింది. షోను నిలిపివేయాలని కోర్ట్ లలో పిటీషన్స్ వేయడం కూడా జరిగింది.
ఎవరెన్ని చేసినా బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రస్తు బిగ్ బాస్ సీజన్ 6 కూడా నిన్న గ్రాండ్ గా మొదలు అయ్యింది. ఈ నేపథ్యంలో మళ్లీ రంగంలోకి దిగారు సీపీఐ నారాయణ. ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ ఎలా విరుచుకుపడ్డారో చూద్దాం రండి.

కాసులకు కక్కుర్తి పడేవాళ్లున్నంతకాలం ఇలాంటి షోలు ఉంటాయని నారాయణ అన్నారు. బిగ్‌బాస్ షోతో ఏం సందేశం ఇస్తున్నారో ప్రేక్షకులు ప్రశ్నించాలని నారాయణ కోరారు. బిగ్ బాస్ షోను బూతుల స్వర్గంగా మారుస్తారా అని సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయాన్ని వృధా చేసే కార్యక్రమంగా బిగ్ బాస్ షోని పేర్కొన్నారు.
బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారీ సీపీఐ నారాయణ విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన విమర్శలను పట్టించుకున్న వాడు లేడు. పైగా బిగ్ బాస్ కి ఇదొక ఫ్రీ పబ్లిసిటీలా ఉపయోగపడుతుంది. మరి సీపీఐ నారాయణ ఈ విషయం ఎందుకు అర్ధం కావడం లేదో. అయినా ప్రతి ఏటా ఇలా నాలుగు బూతులు తిట్టడమేనా.. లేక పోరాటం చేసేది ఏమైనా నారాయణా !!.
[…] Also Read: CPI Narayana Comments On Bigg Boss 6: ‘బిగ్ బాస్ బూతుల షోనే..… […]