CP Ranganath : పోలీస్ అంటే ఎలా ఉండాలో మన సీపీ రంగనాథ్ చేసి చూపిస్తున్నారు. ప్రజల సమస్యలే పరిష్కారంగా పాటుపడుతున్నారు. సమస్య వచ్చిందని ఏ మారుమూల గ్రామం నుంచి ఎవ్వరు వచ్చినా శ్రద్ధతో విని మరీ దాన్ని అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. పోలీస్ అంటే ఇన్నాళ్లు భయపడే జనాలకు అసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో చూపిస్తున్నారు. సీపీ చొరవతో వరంగల్ కమిషనరేట్ పరిధిలో నేరాలు తగ్గాయి, కబ్జాలు, కుంభకోణాలకు అడ్డుకట్టపడింది. ప్రజల భూ సమస్యలు తీరిపోయాయి.. ప్రజలందరూ గుండెమీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోతున్నారంటే అది రంగనాథ్ ఘనతనే..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహిస్తున్న పోలీస్ ప్రజావాణికి విశేష స్పందన రావడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను ప్రజావాణి కార్యక్రమం ద్వారా పోలీస్ కమిషనర్ కు అందజేస్తున్నారు. దీనితో పోలీస్ ప్రజావాణి రోజున కేవలం 30 నుండి 40 వరకు ఫిర్యాదులను మాత్రమే పరిశీలించబడుతున్నాయి. మిగిలిన ఫిర్యాదులు పెండింగ్లో పడుతున్నాయి. ఇప్పటి వరకు ఫిర్యాదుదారులు అందించిన ఫిర్యాదుల్లో మూడు వేలకుపైగా ఫిర్యాదులు పెండింగ్లో వున్నాయి. ఈ పెండింగ్లో ఫిర్యాదులను క్రమబద్ధీకరణ చేసేందుకుగాను పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా ముందుగా పెండింగ్ లో వున్న ఫిర్యాదుల్లో అత్యవసరమైనవి అనగా స్థానిక పోలీసులు తమ ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకోకున్న, స్థానికంగా పరపతి కలిగిన వ్యక్తుల నుండి ఇబ్బందులకు గురౌవుతున్న, పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులకు మొదటగా ప్రాధాన్యత కల్పిస్తూ ఈ ఫిర్యాదులు అందించిన ఫిర్యాదుదారులకు వరుస క్రమంలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారు.. సమాచారం అందుకున్న ఫిర్యాదుదారులకు సూచించిన తేదిలో మాత్రమే పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహించే పోలీస్ ప్రజావాణికి హాజరై తమ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు.
నేరుగా పోలీస్ కమిషనరు ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులకు తెలిపేందుకు అవకాశం కల్పించబడుతుంది. ముఖ్యంగా ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులు తప్పనిసరిగా ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్.హెచ్.ఓకు ఫిర్యాదు చేసుకోవాలని, ఎస్.హెచ్.ఓ స్థాయిలో ఫిర్యాదుదారునికి తగు న్యాయం జరగని ఎడల ఫిర్యాదుదారుల తర్వాత డివిజన్ పరిధిలోని ఏసిపి స్థాయి పోలీస్ అధికారి లేదా జోన్ పరిధిలోని డిసిపి స్థాయి పోలీస్ అధికారికి ఫిర్యాదు చేయాల్సి వుంటుందని తెలిపారు.. పోలీస్ కమిషనర్ జోక్యం అవసరం అయినటువంటి ఫిర్యాదులను ఫిర్యాదుదారులు 8712685294 వాట్సప్ నంబర్ కు సమాచారం అందించాలని, అలాగే మీ ఫిర్యాదులపై పోలీస్ అధికారులు సరైన చర్యలు తీసుకోకున్న, ఏదైన అత్యవసరమైన ఫిర్యాదు. చేయాలనకునే ఫిర్యాదుదారులు సంక్షిప్త సమచారంతో వరంగల్ పోలీస్ కమిషనర్ నంబర్ 8712685100 కు గానీ పరిపాలన విభాగం అదనపు డిసిపి సెల్ నంబర్ 8712865000కు సంక్షిప్త మెసేజ్ చేయాలని పోలీస్ కమీషనర్ ఫిర్యాదుదారులకు సూచించారు.
ప్రజల వద్దకు పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్, డివిజన్ -స్థాయిలో ఏసిపీలు, జోన్ పరిధిలో డిసిపిలు ప్రతి సోమవారం నాడు పోలీస్ గ్రీవెన్స్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తొలి సారిగా ప్రజల వద్దకు పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఈ గురువారం 11వ తేదీన జనగాం జిల్లా కేంద్రంలోని వెస్ట్ జోన్ డిపిపి కార్యాలయములో ఏర్పాటు చేయబడింది. ఈ పోలీస్ ప్రజావాణిలో ఉదయం 11గంటల నుండి వరంగల్ పోలీస్ కమిషనర్ ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారని. ఈ అవకాశాన్ని జనగామ జిల్లా ప్రజలు వినియోగించుకోగలరని వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలియజేసారు.
ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలే పరిష్కారంగా చొరవ చూపుతున్న సీపీ రంగనాథ్ చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.