
ప్రపంచంలో కరోనా సెకండ్ వేవ్ తన ప్రభావాన్ని గట్టిగానే చూపిస్తోంది. ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. గతంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం వ్యాక్సిన్లు విదేశాలకు ఎగుమతి చేసింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ఉపయోగం తెలుసుకున్నాక అందుబాటులో లేకపోవడంతో అవి దొరకని సందర్బాలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ప్రభుత్వాల్లో స్పందన కనిపించడం లేదు.
దేశంలోని రాష్ర్టాల్లో కరోనా తన ప్రభంజనం చూపెడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. లాక్ డౌన్ మీ ఇష్టం అంటూ రాష్ర్టాలకు సూచించింది. దీంతో కొన్ని రాష్ర్టాలు లాక్ డౌన్ విధించగా కొన్ని పట్టించుకోలేదు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి వ్యాక్సినే ఔషధంగా గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్రం సానుకూలంగా స్పందించడం లేదు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్ లో పరిస్థితి ఇలాగే కొనసాగితే థర్డ్ వేవ్ రావడానికి ఎంతో సమయం పట్టదని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పెరిగిపోతోంది. దీంతో కరోనా థర్డ్ వేవ్ విజృంభించడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. సెకండ్ వేవ్ తో అల్లాడిపోతున్న దేశానికి థర్డ్ వేవ్ ప్రమాదకరమని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు పట్టించుకుని వ్యాక్సినేషన్ పై దృష్టి పె ట్టాల్సిన అవసరం గుర్తించి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే టీకాల పంపిణీ చేయాలని కోరుతున్నారు.
దేశంలో ప్రభుత్వాలు థర్డ్ వేవ్ పై ముందుగానే మేల్కోవాల్సిన అవసరం ఏర్పడింది. వ్యాక్సిన్ పంపిణీపై పట్టించుకుని ప్రజలకు అందేలా చూడాలి. ప్రభుత్వం తీసుకునే శ్రద్ధ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైనా వ్యాక్సినేషన్ అందరికీ అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.