
ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇప్పటికే ఈ మిగిలిన టోర్నీని యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే. దీనిపై అక్కడి బోర్డుతో చర్చించడానికి శుక్లా యూఏఈ వెళ్లారు. మరో రెండు రోజుల్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జే షా, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ కూడా యూఏఈ రానున్నట్లు ఈ సందర్భంగా రాజీవ్ శుక్లా వెల్లడించారు.