ఈ సంవత్సరం రంజాన్ ఇళ్లలోనే

ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ సంవత్సరం ప్రార్ధనలు ఇళ్ల వద్ద నుండే చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రార్ధన స్థలాలలో గుమికూడదన్ని నిషేధించడంతో పాటు సామూహికంగా కలవడాన్ని కూడా అనుమతులు లేకపోవడంతో రంజాన్ పండుగను కూడా ఇంటి నుండి జరుపుకోవలసిందే. రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రజలు లాక్‌డౌన్ ఆదేశాలను, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి విజ్ఞప్తి చేశారు. ప్రార్థనలు, మత పరమైన ఆచారాలను ఇళ్లలోనే […]

Written By: Neelambaram, Updated On : April 13, 2020 5:40 pm
Follow us on


ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ సంవత్సరం ప్రార్ధనలు ఇళ్ల వద్ద నుండే చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రార్ధన స్థలాలలో గుమికూడదన్ని నిషేధించడంతో పాటు సామూహికంగా కలవడాన్ని కూడా అనుమతులు లేకపోవడంతో రంజాన్ పండుగను కూడా ఇంటి నుండి జరుపుకోవలసిందే.

రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రజలు లాక్‌డౌన్ ఆదేశాలను, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి విజ్ఞప్తి చేశారు. ప్రార్థనలు, మత పరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియాలో స్టేట్ వక్ఫ్ బోర్డుల నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌ చైర్మన్‌గా కూడా నఖ్వి ఉన్నారు.

‘ఏడు లక్షలకు పైగా రిజిస్టర్ అయిన మసీదులు, ఈద్గాలు, ఇమాంబాద్, దర్గాలు, ఇతర మత సంస్థలు స్టేట్ వక్ఫ్ బోర్డుల కిందకు వస్తాయి’ అని నఖ్వి తెలిపారు. కోవిడ్-19 సంక్షోభ నేపథ్యంలో రంజాన్ మాసం వస్తున్నందున లాక్‌డౌన్ నిబంధనలు, సామాజిక దూరం పాటించేలా చూడాలని వివిధ మత నేతలు, అధికారులు, స్టేట్ వక్ఫ్ బోర్డుల ఆఫీసు బేరర్లను ఇప్పటికే కోరానని చెప్పారు.

ఇళ్లలోనే ఉండి రంజాన్ వేడుకలు జరుపుకునేలా చూస్తామని మత పెద్దలంతా తనకు హామీ ఇచ్చారని చెప్పారు. లాక్‌డౌన్‌కు కట్టుదిట్టంగా, సమర్థవంతంగా అమలు చేసే విషయంలో స్థానిక యంత్రాగానికి మత, సామాజిక సంస్థలు, వ్యక్తులు సహకరించాలని మంత్రి కోరారు.

కోవిడ్-19ని దృష్టిలో పెట్టుకుని అన్ని దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు, మతపరమైన సంస్థల్లో కార్యక్రమాలు రద్దయిన విషయాన్ని నఖ్వి మరోసారి గుర్తు చేశారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందువల్ల అందరికీ హాని జరుగుతుందని, కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు అధికార యంత్రాగం ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను విధిగా పాటించాలని కేంద్ర మంత్రి కోరారు