అమెరికాలో తగ్గిన కరోనా ఉధృతి

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా అమెరికాలో మాత్రం తన ప్రభావాన్ని తగ్గించుకుంది. దీంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ప్రముఖులతో కరచాలనాలు, ఆలింగనాలతో సందడిచేశారు. ఆంక్షలు సడలించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి కావడంతో మెల్లమెల్లగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. టీకాల వినియోగంతో ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగి మునుపటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందరిలో భయం పోయి మామూలుగానే ఉంటున్నారు. ఇన్నాళ్లు భయం గుప్పిట్లో గడిపిన జనం ఇప్పుడు కలివిడిగా తిరుగుతున్నారు. […]

Written By: Srinivas, Updated On : May 24, 2021 11:44 am
Follow us on

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా అమెరికాలో మాత్రం తన ప్రభావాన్ని తగ్గించుకుంది. దీంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ప్రముఖులతో కరచాలనాలు, ఆలింగనాలతో సందడిచేశారు. ఆంక్షలు సడలించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి కావడంతో మెల్లమెల్లగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. టీకాల వినియోగంతో ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగి మునుపటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందరిలో భయం పోయి మామూలుగానే ఉంటున్నారు. ఇన్నాళ్లు భయం గుప్పిట్లో గడిపిన జనం ఇప్పుడు కలివిడిగా తిరుగుతున్నారు.

శ్వేతసౌదంలో సైతం సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంక్షల సడలింపులతో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా గడుపుతున్నారు. మే 13న ఆంక్షలు సడలిస్తూ అధ్యక్షుడు బైడెన్ ప్రకటన చేశారు. దీంతో రెండు డోసులు తీసుకున్న వారు మాస్కులు సైతం ధరించాల్సిన పని లేకుండా ఫ్రీగా తిరుగుతున్నారు. ఈ వాతావరణాన్ని అందరికంటే ఎక్కువగా అధ్యక్షుడు బైడెన్ ఆస్వాదిస్తున్నారు. అమెరికా మునుపటి పరిస్థితిని చేరుకోవడం శుభ పరిణామమని పేర్కొన్నారు.

శ్వేతసౌదంలో అతిపెద్ద గది అయిన ఈస్ట్ రూమ్ తెరిచారు. అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో తొలిసారిలో జో బైడెన్ మోడల్ ఆఫ్ ఆనర్ ప్రదానం చేశారు. 70 ఏళ్ల క్రితం కొరియా యుద్ధంలో చూపిన ధైర్యసాహసాలకు గుర్తుగా 94 ఏళ్ల రిటైర్డ్ కల్నల్ రాల్ఫ్ పకెట్ జూనియర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ పలుమార్లు కరచాలనం చేశారు. యుద్ధవీరుల కుటుంబాలతో ఫొటోలు దిగారు.

అమెరికా అధ్యక్షుడు, ఉఫాధ్యక్షురాలు కరోనా నిర్మూలనలో ప్రముఖ పాత్ర పో షించారు. టీకా ప్రక్రియ వినియోగంతోపాటు అన్ని వర్గాల ప్రజలకు వైరస్ ముప్పును తగ్గించడానికి పలు మార్గాలు చూపారు. ఇందులో భాగంగా అమెరికా కరోనా వైరస్ ను నిరోధించడంలో తమదైన శైలిలో స్పందించారు. ప్రజల శ్రేయస్సే ప్రధానంగా ముందుకు నడిచారు. ప్రజలను చైతన్యవంతులను చేశారు. టీకా ప్రాధాన్యత తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలో మునుపటి పరిస్థితి రావడంలో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.