4 నుంచి రాష్ట్రానికి కేంద్ర బృందం…!

రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, కోవిడ్-19 వ్యాధి బారిన పడిన చికిత్స పొందుతున్న, మరణించిన వారి వివరాలు తెలుసుకునెందుకు కేంద్ర బృందం మే 4వ తేదీన ఆంద్రప్రదేశ్ కు రానుంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ పర్యటనలో కరోనా ప్రభావం, తాజాపరిస్థితి, లాక్ డౌన్ అమలు తీరు, కరోనాపరీక్షలు జరిగుతున్న విధానం, కరోనా వైరస్ బారినపడిన చికిత్స పొందుతున్న వారికి అందిస్తున్న వైద్య విధానాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించనున్నారు. రెడ్ […]

Written By: Neelambaram, Updated On : April 30, 2020 1:02 pm
Follow us on


రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, కోవిడ్-19 వ్యాధి బారిన పడిన చికిత్స పొందుతున్న, మరణించిన వారి వివరాలు తెలుసుకునెందుకు కేంద్ర బృందం మే 4వ తేదీన ఆంద్రప్రదేశ్ కు రానుంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ పర్యటనలో కరోనా ప్రభావం, తాజాపరిస్థితి, లాక్ డౌన్ అమలు తీరు, కరోనాపరీక్షలు జరిగుతున్న విధానం, కరోనా వైరస్ బారినపడిన చికిత్స పొందుతున్న వారికి అందిస్తున్న వైద్య విధానాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించనున్నారు. రెడ్ జోన్, అరేంజి జోన్, గ్రీన్ జోన్ లలో తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.

వలస కార్మికుల భారం రాష్ట్రాలపైననే!

కేంద్ర బృందం రాకతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల విషయంలో ఇన్నాళ్ల నుంచి జరుగుతున్న రాద్దాంటానికి తీసుపడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ కేసులు దాస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు విమర్శిస్తున్నాయి. బీజేపీ నాయకులు ఆ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదైన కర్నూలులో ప్రభుత్వం వెల్లడిస్తున్న లెక్కలు వాస్తవం కాదని మాజీ మంత్రి అఖిలప్రియ తెలిపారు. ప్రభుత్వం ఆ వివరాలు బయట పెట్టకుంటే తన దగ్గర ఉన్న వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం కరోనా లెక్కల విషయంలో ఎం చెబుతోందనేది ఆసక్తిగా మారింది.