కోర్టు ఆదేశాలు పట్టించుకోలేదు..: జైళ్లోనే ఎంపీ

ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో సీఐడీ అధికారుల తీరుపై సర్వత్రా చర్చనీయంశంగా మారుతోంది. ఆయన విషయంలో హైకోర్టు ఆదేశాలను వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఓ ఎంపీగా, సగటు పౌరునిగా రఘురామకృష్ణం రాజుపై వారి ప్రవర్తనపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా వారు మాత్రం తమకు నచ్చిందే చేస్తున్నారని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడమే కాకుండా రాజ్యాంగ హక్కులన్నీ ఉల్లంఘించారని అంటున్నారు. రఘురామకృష్ణం రాజును కోర్టు నుంచి ఆసుపత్రికి తరలించాలని స్పష్టమైన ఆదేశాలున్నా వాటిని పట్టించుకోకుండా […]

Written By: NARESH, Updated On : May 17, 2021 11:03 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో సీఐడీ అధికారుల తీరుపై సర్వత్రా చర్చనీయంశంగా మారుతోంది. ఆయన విషయంలో హైకోర్టు ఆదేశాలను వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఓ ఎంపీగా, సగటు పౌరునిగా రఘురామకృష్ణం రాజుపై వారి ప్రవర్తనపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా వారు మాత్రం తమకు నచ్చిందే చేస్తున్నారని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడమే కాకుండా రాజ్యాంగ హక్కులన్నీ ఉల్లంఘించారని అంటున్నారు. రఘురామకృష్ణం రాజును కోర్టు నుంచి ఆసుపత్రికి తరలించాలని స్పష్టమైన ఆదేశాలున్నా వాటిని పట్టించుకోకుండా రాత్రంతా జైళ్లోనే పెట్టారు.

ప్రభుత్వంపై దూషణలు చేశారని ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీఐడీ అధికారి అదనపు డీసీ ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. దీనిని సోమోటాగా స్వీకరించిన సీఐడీ ఆయనపై కేసు పెట్టింది. అయితే రాజ్యంగం ప్రకారం సీఐడీ అధికారులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎంపీ రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయాలి. కానీ ఆ ఆదేశాలను నిర్మోహమాటంగా ఉల్లంఘించారు. కావాలనే ఆలస్యం చేసి సమయం లేదని చెప్పి జీజీహెచ్లో మాత్రమే పరీక్షలు చేసి జైలుకు తరలించారు.

ఎంపీని రమేశ్ ఆసుపత్రికి తరలిస్తే ఏదో బయటపడుతుందనే సీఐడీ అధికారులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రఘురామకృష్ణం రాజుకు చికిత్స చేస్తున్న సమయంలో సీఐడీ అదనపు డీజీ ఆయనను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఎంపీని కొట్టడం వల్లనే కాళ్లు అలా తయారయ్యాయని, ఆయనకు సోరియాసిస్ లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. రాత్రికి రాత్రే సోరియాసిస్ వ్యాధి ఎలా వస్తుందని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వంపై విమర్శలు చేసినంత మాత్రాన ఓ ఎంపీని ఇంత దారుణంగా చేస్తారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కొత్తేమీ కాదు. అయితే న్యాయ వ్యవస్థ సంయమనం పాటిస్తుండడంతో ప్రభుత్వం మరింత దూకుడుగా ప్రవర్తిస్తోందని అంటున్నారు.