అఖిలప్రియకు కోర్టులో ఊరట..

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియకు గొప్ప ఊరట కలిగింది. ఈ మేరకు కోర్టులో ఈరోజు అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. Also Read: ఒంటరైన దేవినేని.. వైసీపీతో ఫైట్ కు కలిసిరాని నేతలు? ఇప్పటికే మూడు సార్లు బెయిల్ కోసం అఖిలప్రియ కోర్టులో పిటీషన్ వేయగా మూడోసారి ఆమెకు బెయిల్ మంజూరైంది. అఖిలప్రియకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సికింద్రాబాద్ కోర్డు తెలిపింది. ఇక […]

Written By: NARESH, Updated On : January 22, 2021 7:30 pm
Follow us on

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియకు గొప్ప ఊరట కలిగింది. ఈ మేరకు కోర్టులో ఈరోజు అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది.

Also Read: ఒంటరైన దేవినేని.. వైసీపీతో ఫైట్ కు కలిసిరాని నేతలు?

ఇప్పటికే మూడు సార్లు బెయిల్ కోసం అఖిలప్రియ కోర్టులో పిటీషన్ వేయగా మూడోసారి ఆమెకు బెయిల్ మంజూరైంది. అఖిలప్రియకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సికింద్రాబాద్ కోర్డు తెలిపింది.

ఇక ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ వేసిన అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి చుక్కెదురైంది. వారిద్దరి బెయిల్ పిటీషన్లను కోర్టు కొట్టివేసింది.

Also Read: నిమ్మగడ్డ వర్సెస్ జగన్.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ

తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేసిన వైనం సంచలనమైంది. ఈ కేసులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, ఇతడి సోదరుడు, ఏవీ సుబ్బారెడ్డిలు ప్రధాన పాత్రదారులుగా ఉన్నారు. హఫీజ్ పేటలోని 50 ఎకరాల భూమి గురించే ఈ కిడ్నాప్ చోటు చేసుకుంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్