https://oktelugu.com/

తెలంగాణలో అవినీతి కథ.. మారుతోందా?

తెలంగాణలో అవినీతి కథను మార్చేందుకు కేసీఆర్ నడుం బిగించారు.నిజానికి ఈ పని రెండోసారి అధికారంలోకి రాగానే చేపట్టారు. అప్పుడు ఉద్యోగులంతా ఏకమై సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో హోల్డ్ లో పెట్టారు. ఆ తర్వాత గత జనవరిలో మళ్లీ షురూ చేయగా.. కరోనా దాడి మొదలైంది. కాగా ఇప్పుడు మళ్లీ దుమ్ము దులిపి రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. Also Read: కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా? తెలంగాణలో దాదాపు 10వేల రెవెన్యూ గ్రామాలున్నాయి. గ్రామానికి ఒక […]

Written By:
  • NARESH
  • , Updated On : August 27, 2020 10:14 am
    Follow us on


    తెలంగాణలో అవినీతి కథను మార్చేందుకు కేసీఆర్ నడుం బిగించారు.నిజానికి ఈ పని రెండోసారి అధికారంలోకి రాగానే చేపట్టారు. అప్పుడు ఉద్యోగులంతా ఏకమై సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో హోల్డ్ లో పెట్టారు. ఆ తర్వాత గత జనవరిలో మళ్లీ షురూ చేయగా.. కరోనా దాడి మొదలైంది. కాగా ఇప్పుడు మళ్లీ దుమ్ము దులిపి రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు.

    Also Read: కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా?

    తెలంగాణలో దాదాపు 10వేల రెవెన్యూ గ్రామాలున్నాయి. గ్రామానికి ఒక వీఆర్వో ఉండాలి. కానీ ఉన్నది 5900మంది వీఆర్వోలు.. ఇక వీరికింద 22వేల మంది వీఆర్ఏలున్నారు. గడిచిన 8 నెలల కాలంలో ఏకంగా 25 మందికి పైగా వీఆర్వోలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇంత విచ్చలవిడి వీఆర్వోల అవినీతి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది. లంచావతారులుగా మారి కోట్లు కొల్లగొడుతున్న వీఆర్వోల వ్యవస్థనే తీసివేయాలని కేసీఆర్ పట్టుదలతో ముందుకెళ్తున్నారు. కానీ కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లేలా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తుండడంతో ఈ చట్టం రూపుదాల్చడం లేదు.

    కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్న కేసీఆర్.. వీఆర్వోలను సమూలంగా తొలగించాలని నిర్ణయించారు. వారిని వేరే శాఖల్లో సర్దుబాటు చేయాలని యోచిస్తున్నారు. వీఆర్వోలు అవసరమా అన్న కేసీఆర్ ప్రశ్నకు 90శాతం మంది కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు అవసరమేనని కుండబద్దలు కొట్టడం విశేషం. గ్రామస్థాయిలో రెవెన్యూ, ఇతర ధ్రువీకరణకు వీఆర్వోలే కీలకమని.. వారు లేకపోతే పనులు జరగడం కష్టమని.. తమకు వారే కీలకమని అధికారులు చెప్పారట.. అవినీతి గురించి పట్టని రెవెన్యూ అధికారులు తమ పనులు చక్కబెట్టుకునే ఉద్యోగిగానే వీఆర్వోలను చూడడం గమనార్హం.

    కానీ కేసీఆర్ మాత్రం వీఆర్వోలలోని లంచావతారులను ఏరివేయడానికి రెడీ అయ్యాయి. అయితే రెవెన్యూ శాఖ మాత్రం వాళ్లు ఉండాల్సిందేనన్నారట.. ఒకరిద్దరు కలెక్టర్లు మాత్రమే వీఆర్వోలు వద్దంటూ కేసీఆర్ కు సపోర్టు చేశారట..

    Also Read: కలిసొచ్చిన కాలం.. టీపీసీసీలో ఉత్తమ్ దే రాజ్యం

    తెలంగాణ సహా ఏ రాష్ట్రంలోనైనా రెవెన్యూశాఖ అవినీతితో భ్రష్టుపట్టిపోయింది. తహసీల్దార్లే కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ దొరుకుతున్న దుస్థితి నెలకొంది. అందుకే కేసీఆర్ పట్టుదలతో కొత్త రెవెన్యూ చట్టానికి తుది మెరుగులు దిద్దడానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ చట్టం మాదిరిగానే అవినీతికి ఆస్కారం లేకుండా రూపొందించిన కొత్త రెవిన్యూ చట్టానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో చాలా లోపాలు ఉన్నాయని.. ఇక మీద అటువంటి వాటికి ఆస్కారం ఉండని విధంగా సీఎం కేసీఆర్ కొత్త చట్టాన్ని పకడ్బందీగా రూపకల్పన చేసినట్లు సమాచారం.

    రెవెన్యూశాఖలో మ్యూటేషన్ దగ్గర నుంచి భూముల క్రయవిక్రయాలు.. రెవెన్యూ వ్యవస్థలోని పనులు అంతా ఆన్ లైన్ లోనే చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. తద్వారా అవినీతిని తెలంగాణలో లేకుండా చేయాలని యోచిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అధికారులు ఎంతవరకు సహకరిస్తారన్నది వేచిచూడాలి.

    -ఎన్నం