https://oktelugu.com/

పెంపుడు కుక్కతో ప్రేమలో పడ్డ హీరోయిన్ !

తెలుగు హీరోయిన్ అంజలికి తెలుగులో కంటే.. తమిళంలోనే ఎక్కువ మార్కెట్ ఉంది. ఎక్కువ గుర్తింపు ఉంది. మనోళ్ళకు తెలుగు హీరోయిన్స్ అంటే కాస్త చిన్న చూపు అనేది నిజమే కాబోలు. లేకపోతే అంజలి లాంటి బ్యూటీని కూడా మన దర్శకులు వాడుకోవట్లేదు అంటే.. ఏమనుకోవాలి. సరే.. ఇక అంజలి ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతుంది. సహజంగా సెలెబ్రిటీల్లో చాలా మంది పెట్స్ లవర్స్ అయి ఉంటారనేది తెలిసిందే, ముఖ్యంగా హీరోయిన్స్. పెట్స్ ను కొంతమంది హీరోయిన్స్ సొంత బిడ్డల్లా […]

Written By:
  • admin
  • , Updated On : August 27, 2020 / 10:01 AM IST
    Follow us on


    తెలుగు హీరోయిన్ అంజలికి తెలుగులో కంటే.. తమిళంలోనే ఎక్కువ మార్కెట్ ఉంది. ఎక్కువ గుర్తింపు ఉంది. మనోళ్ళకు తెలుగు హీరోయిన్స్ అంటే కాస్త చిన్న చూపు అనేది నిజమే కాబోలు. లేకపోతే అంజలి లాంటి బ్యూటీని కూడా మన దర్శకులు వాడుకోవట్లేదు అంటే.. ఏమనుకోవాలి. సరే.. ఇక అంజలి ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతుంది. సహజంగా సెలెబ్రిటీల్లో చాలా మంది పెట్స్ లవర్స్ అయి ఉంటారనేది తెలిసిందే, ముఖ్యంగా హీరోయిన్స్. పెట్స్ ను కొంతమంది హీరోయిన్స్ సొంత బిడ్డల్లా చూసుకుంటే ఇంకొందరు తోబుట్టువులా చూసుకుంటూ.. వాటితోనే టైం పాస్ చేస్తూ ఉంటారు. ఇక మరికొందరు తన బెస్ట్ ఫ్రెండ్‌లా పెట్స్‌ను ట్రీట్ చేస్తూ.. వాటికి కబుర్లు కూడా చెబుతూ.. వాటితోనే గేమ్స్ కూడా అడకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.

    Also Read: ప్రభాస్ పెళ్లి.. అందుకే చేసుకోవట్లేదట !

    అయితే అంజలి మాత్రం తన జీవితంలోనే తన పెంపుడు కుక్కకు ప్రముఖ స్థానాన్ని ఇచ్చిందట. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ తెలుగు బ్యూటీ తాజాగా కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేస్తూ.. తన ప్రేమను ఆ రకంగా వ్యక్తపరిచింది. ఇంటర్నేషనల్ డాగ్స్ డే సందర్భంగా అంజలి తన పెట్స్‌ పై తనకున్న తీవ్రమైన ప్రేమను చాలా బలంగానే చాటుకుంది. ఎప్పటినుండో పోలో అనే పెట్‌ను అంజలి చాలా ప్రేమగా పెంచుకుంటుంది. ఈ పోలోని అంజలి తన బాయ్ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తోందట. తన బాయ్ ఫ్రెండ్ గురించి అంజలి చెబుతూ.. నా జీవితంలోకి నువ్ వచ్చి ఇంత ప్రేమను, సంతోషాన్ని పంచుతున్నందుకు థ్యాంక్స్ పోలో అని అంజలి తెగ సిగ్గు పడిపోతుంది.

    Also Read: ‘పుష్ప’ కోసం సుకుమార్ కాపీల గోల !

    ఆ మధ్య అంజలి హీరో జైతో ప్రేమాయణం సాగించిన బాగోతం తెలిసిందే. వీరి ప్రేమ వ్యవహారాన్ని ఓ తమిళ నిర్మాత బయటకు చెప్పి.. వీరి గుట్టును రట్టు చేశాడు. మరి ఆ తరువాత ఏమైందో ఏమో గాని, మళ్లీ అంజలి జై ప్రేమ కహానీలు ఎక్కువగా వార్తల్లో రాలేదు. బహుశా జై స్థానాన్ని పోలో కొట్టేసినట్లు ఉన్నాడు. ఇక అంజలి మాత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు నిశ్శబ్దం, వకీల్ సాబ్‌తో రెడీ అవుతోంది. నిజానికి జర్నీ, షాపింగ్ మాల్, గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ సినిమాల తరువాత కూడా అంజలి కెరీర్ స్పీడ్ అందుకోకపోవడం అంజలికి లోటే.