https://oktelugu.com/

కరోనా రికార్డు బ్రేక్‌.. చాలా రాష్ట్రాల్లో వీకెండ్‌లో కర్ఫ్యూ

కరోనా కేసులు రోజురోజుకూ దేశ ప్రజలను కలవరపెడుతున్నాయి. ఊహించని విధంగా కరోనా సెకండ్‌ వేవ్‌ రాకెట్‌ స్పీడ్‌ను మించి దూసుకొస్తోంది. కేసుల సంఖ్య వేల నుంచి ఇప్పుడు లక్షలకు చేరింది. మొన్నటి వరకు లక్షతో ఆగిపోయిన కేసులు.. గడిచిన 24 గంటల్లో రెండు లక్షలు దాటిపోయాయి. తాజాగా.. 2.17.353 కొత్త కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటివరకు 1.42 కోట్లకు పైగా కేసులు వచ్చాయి. దేశంలో శుక్రవారానికి యాక్టివ్ కేసుల సంఖ్య 15,69,743 కాగా, 1,25,47,866 మంది […]

Written By: , Updated On : April 16, 2021 / 01:18 PM IST
Follow us on

Weekend curfewకరోనా కేసులు రోజురోజుకూ దేశ ప్రజలను కలవరపెడుతున్నాయి. ఊహించని విధంగా కరోనా సెకండ్‌ వేవ్‌ రాకెట్‌ స్పీడ్‌ను మించి దూసుకొస్తోంది. కేసుల సంఖ్య వేల నుంచి ఇప్పుడు లక్షలకు చేరింది. మొన్నటి వరకు లక్షతో ఆగిపోయిన కేసులు.. గడిచిన 24 గంటల్లో రెండు లక్షలు దాటిపోయాయి. తాజాగా.. 2.17.353 కొత్త కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటివరకు 1.42 కోట్లకు పైగా కేసులు వచ్చాయి.

దేశంలో శుక్రవారానికి యాక్టివ్ కేసుల సంఖ్య 15,69,743 కాగా, 1,25,47,866 మంది రికవరీ అయ్యారు. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 88.31 శాతానికి పడిపోయిందని ఏజెన్సీ తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1,185 మంది చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,74,308కు చేరుకుంది.

ముఖ్యంగా మహారాష్ట్రను కరోనా వైరస్‌ వణికిస్తోంది. తాజాగా 24 గంటల్లో 61,695 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం 36,39,855 కేసులు నమోదయ్యాయి. తాజాగా 349 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 59,153కు చేరుకున్నాయి. ఏప్రిల్ చివరి వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ విధించి పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఢిల్లీలోనూ కరోనా బెంబేలెత్తిస్తోంది. అక్కడి ప్రభుత్వం ఇప్పటికే వీకెండ్‌ కర్ఫ్యూ కొనసాగిస్తోంది. ఈ సాయంత్రం నుంచి సోమవారం వరకు షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, స్పాలు మూసివేయాలని ఆదేశించింది. కాగా.. బుధవారం 17,000 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం 16,699 కేసులు వచ్చాయి. రాజస్థాన్‌లోనూ ఈ సాయంత్రం నుంచి సోమవారం వరకు వీకెండ్‌ కర్ఫ్యూ పెట్టింది. మరోవైపు.. అడ్డుకోకుండా కొనసాగిస్తున్న ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌‌లోని కుంభమేళాలో సైతం పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఏకంగా 30 మంది సాధువులు కరోనా బారిన పడ్డారు.