కానీ ఇప్పుడు సమంత కొత్త రకం కథలను ఎన్నుకుంటుంది. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ అడిగినా.. కథ నచ్చితేనే సినిమా చేస్తానంటుంది. పైగా తన పాత్ర బాగుంటే.. వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తోంది. తాజాగా ఆమె నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’ జూన్ 4 న విడుదల కాబోతోంది. ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమ్ కాబోతుండటం విశేషం.
మనోజ్ బాజ్ పేయ్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ లో అక్కినేని సమంత రాజి అనే టెర్రరిస్ట్ పాత్రను పోషిస్తోంది. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి సైడ్ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నావ్ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. క్యారెక్టర్ సైడ్ కావొచ్చు, ఎమోషన్ మెయిన్ అంటూ ఈ సిరీస్ లో తానే మెయిన్ అని ఇన్ డైరెక్ట్ గా చెబుతుంది. ఈ ‘ది ఫ్యామిలీ మేన్ 2’ కథ చెన్నైలో జరుగుతుంది.
సమంత తమిళ టెర్రరిస్ట్ గా నటించడంతో పాటు తమిళంలో స్వయంగా ఆమె డబ్బింగ్ చెప్పుకొంది. ఇక ఈ సిరీస్ లో సమంత చాలా డేరింగ్ సీన్స్ ను చేసిందని, తన పాత్రకు మంచి పేరు వస్తోందని సమంత ఫీల్ అవుతుంది. ఒకవేళ అనుకున్నట్టుగానే తన పాత్రకి క్రేజ్ వస్తే గనుక, భవిష్యత్తలో తానూ మరిన్ని వెబ్ సిరీస్ లు చేయాలనుకుంటోందట సమంత. మరి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా సమంతకు మార్కెట్ ఉంది కాబట్టి, వెబ్ సిరీస్ లు చేసే అవకాశం ఉంది.