https://oktelugu.com/

ఏపీలో 40 చేరిన కరోనా బాధితులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల 40కి పెరిగింది. తాజాగా ఒకే రోజు 17 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. వీరంతా ఢిల్లీ నుంచి వచ్చిన వారే. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ వద్ద ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరిగిన మత ప్రార్థనలకు హాజరైనవారే కావడం విశేషం. ఇప్పటికే అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని మూసివేసి, కార్యక్రమం నిర్వహించిన మత పెద్దపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో […]

Written By: , Updated On : March 31, 2020 / 12:32 PM IST
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల 40కి పెరిగింది. తాజాగా ఒకే రోజు 17 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. వీరంతా ఢిల్లీ నుంచి వచ్చిన వారే. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ వద్ద ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరిగిన మత ప్రార్థనలకు హాజరైనవారే కావడం విశేషం. ఇప్పటికే అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని మూసివేసి, కార్యక్రమం నిర్వహించిన మత పెద్దపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణ వాసులు ఐదుగురు ఉన్నారు. మత సమావేశాలకు ఇరాన్‌, ఇండోనేషియా నుంచి బోధకులు వచ్చారు. 16, 17 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముస్లింలు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల నుంచి సుమారు 2వేల మంది పాల్గొన్నట్టు సమాచారం. సామూహిక ప్రయాణాలు, బస చేయడంతో అక్కడి నుంచే కరోనా విస్తరించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ నుంచి శ్రీకాకుళం మినహా మిగిలిన జిల్లాల నుంచి 369 మంది హాజరయ్యారు. ఒక్క కర్నూలు జిల్లా నుంచే 107 మంది ఢీల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. వీరిలో నలుగురు మాత్రమే ప్రభుత్వ పర్యవేక్షణలో ఐసోలేషన్లో ఉన్నారు. మరోవైపు కరోనా కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతోంది.

జిల్లాల వారీగా నమోదైన కేసులు..
అన్నంతపురం 2
విశాఖ 6
కృష్ణా 5
గుంటూరు 9
ప్రకాశం 11
తూర్పుగోదావరి జిల్లా 4
చిత్తూరు 1
కర్నూలు 1
నెల్లూరు 1

చొప్పున బాధితులు చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.