https://oktelugu.com/

హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

కరోనా మహమ్మరి ఉసరవెల్లిగా రంగులు మారుస్తోంది. రోజురోజుకు కోవిడ్-19 లక్షణాల లిస్టు పెరిగిపోతోంది. జ్వరం.. జలుబు.. దగ్గు.. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది.. ఒళ్లునొప్పులు.. కళ్లు ఎర్రబడటం.. తదితర లక్షణాలు ఉంటే వైద్యులు కరోనా టెస్టులు చేస్తున్నారు. ప్రజలకు కూడా కరోనాపై అవగాహన రావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనాల్లోకి వెళ్లినపుడు మాస్కులు ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. శానిటైజర్లు వాడటం వంటివి చేసున్నారు. అయితే తాజాగా కోవిడ్-19 కొత్త లక్షణం నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2020 / 01:05 PM IST
    Follow us on


    కరోనా మహమ్మరి ఉసరవెల్లిగా రంగులు మారుస్తోంది. రోజురోజుకు కోవిడ్-19 లక్షణాల లిస్టు పెరిగిపోతోంది. జ్వరం.. జలుబు.. దగ్గు.. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది.. ఒళ్లునొప్పులు.. కళ్లు ఎర్రబడటం.. తదితర లక్షణాలు ఉంటే వైద్యులు కరోనా టెస్టులు చేస్తున్నారు. ప్రజలకు కూడా కరోనాపై అవగాహన రావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనాల్లోకి వెళ్లినపుడు మాస్కులు ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. శానిటైజర్లు వాడటం వంటివి చేసున్నారు. అయితే తాజాగా కోవిడ్-19 కొత్త లక్షణం నగరవాసులను బెంబేలెత్తిస్తోంది.

    పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

    హైదరాబాద్ నగరంలో కరోనా మహ్మమరి ఏ లక్షణం లేకుండా విజృంభిస్తోంది. దీంతో నగరవాసులు భయాందోళనకు గురవుతోన్నారు. నగరంలో తాజాగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ కేసులు వస్తుండటం గమనార్హం. తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో కరోనా కలకలం సృష్టించింది. ఈ అకడమీలోని 180మందికి ఎలాంటి లక్షణాల్లేకుండానే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. వీరిలో వందమంది శిక్షణ ఎస్సైలు, మరో 40మంది అకాడమీ సిబ్బంది ఉన్నారు. వీరందరినీ ఐసోలేషన్ కు తరలించారు.

    నగరంలో ఇలాంటి కేసులే ఎక్కువగా బయటపడుతున్నారు. కరోనా సోకిన రోగులు సాధారణంగా ఉంటూ ప్రజల్లో తిరగుతుండటంతో వైరస్ వేగంగా వ్యాపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ఇలాంటి వారిని గుర్తించడం ప్రభుత్వ యంత్రాంగానికి భారమవుతోంది. కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో వైద్య సిబ్బంది ఒత్తిడికి గురవుతోన్నారు. ఇప్పటికే పలువురు వైద్యులు కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. మరికొందరు హోంక్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

    జగన్ కు కేసుల ఫీవర్ పోలేదా?

    ఈ తరుణంలో కరోనా లక్షణాలు లేకుండా నగరంలో ఎక్కువ కేసులు బయటపడుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు పూనుకునేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే పలువురు వ్యాపారులు హైదరాబాద్లో స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా హైదరాబాద్లో నగరంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంది. నగరవాసులు సైతం లాక్డౌన్ విధించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ లాక్డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!