ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..!

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగితుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 376 కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ ప్రభావం ఏపీలో ప్రారంభమైన నాటి నుంచి ఎంత పెద్ద మొత్తంలో పాజిటివ్ కేసుల నమోదు కావడం ఇదే మొదటి సారి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6,230 మందికి వైరస్ సోకగా 3,066 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 3,069 మంది వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం […]

Written By: Neelambaram, Updated On : June 19, 2020 5:47 pm
Follow us on


రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగితుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 376 కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ ప్రభావం ఏపీలో ప్రారంభమైన నాటి నుంచి ఎంత పెద్ద మొత్తంలో పాజిటివ్ కేసుల నమోదు కావడం ఇదే మొదటి సారి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6,230 మందికి వైరస్ సోకగా 3,066 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 3,069 మంది వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చొప్పున మొత్తం నలుగురు మృతి చెందడంతో ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 96కు చేరింది.

సీఎం తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..!

ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపి కొత్తగా 465 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1,423 మందికి వైరస్ సోకగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో 308 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,961కి చేరాయి. ప్రస్తుతం కరోనా సోకి చికిత్స అనంతరం రికవరీ అయిన వారి సంఖ్య కంటే చికిత్స పొందుతున్న వారి సంఖ్య అధికం అయ్యింది.

రాహుల్ గాంధీ.. మరోసారి నవ్వులపాలు!

కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో భాదితుల సంఖ్య వెయ్యి దాటిన కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, కృష్ణ జిల్లా రెండవ స్థానంలో, గుంటూరు జిల్లా మూడవ స్థానంలో, అనంతపురం జిల్లా నాల్గవ స్థానంలో ఉన్నాయి. కరోనా పరీక్షల విషయానికి వస్తే గడచిన 24 గంటల్లో 17,609 శాంపిల్ టెస్టులు చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 6,30,006 పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.