దేశంలో రెండో కరోనా వేవ్.. నైట్ కర్ఫ్యూ అమలు

చైనా దేశంలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్‌.. ఆ వైరస్‌తో ప్రజలు గజగజ వణుకుతున్న వేళ ప్రపంచ దేశాలన్ని కరోనాను అంత సీరియస్‌గా తీసుకోలేదు. దీనికి ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందో అందరికీ తెలిసిందే. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ.. యూరప్ దేశాల్లో తగ్గుముఖం పట్టాయి. జన జీవన స్రవంతి సాధారణం కావటం.. ఎప్పటిలానే తమ కార్యకలాపాలను నిర్వర్తించాయి. Also Read: పంతం వీడని ట్రంప్.. అధికార […]

Written By: NARESH, Updated On : November 22, 2020 6:58 pm
Follow us on

చైనా దేశంలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్‌.. ఆ వైరస్‌తో ప్రజలు గజగజ వణుకుతున్న వేళ ప్రపంచ దేశాలన్ని కరోనాను అంత సీరియస్‌గా తీసుకోలేదు. దీనికి ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందో అందరికీ తెలిసిందే. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ.. యూరప్ దేశాల్లో తగ్గుముఖం పట్టాయి. జన జీవన స్రవంతి సాధారణం కావటం.. ఎప్పటిలానే తమ కార్యకలాపాలను నిర్వర్తించాయి.

Also Read: పంతం వీడని ట్రంప్.. అధికార బదిలీ జరిగేదన్నడూ?

ఇప్పుడు సెకండ్ వేవ్ అమెరికాతోపాటు యూరప్ దేశాల్ని వణికిస్తోంది. మన దేశానికి వస్తే.. సెకండ్.. థర్డ్ వేవ్ అంటూ ఢిల్లీ రాష్ట్రంతోపాటు కేరళను కూడా చేర్చారు. ప్రపంచంలోని పలు దేశాల్లో నడుస్తున్న కరోనా ట్రెండ్ తో పోలిస్తే.. భారత్‌లో పరిస్థితి ఇప్పుడిప్పుడే చేయిదాటుతోంది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్టే తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కరోనా నిబంధనలు టైట్ చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా కొత్త లాక్ డౌన్ గైడ్ లైన్స్ అమలులోకి వచ్చాయి.

అహ్మదాబాద్, ఇండోర్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలు, నగరాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు. మహారాష్ట్రలో అయితే అన్ని పాఠశాలలను ఈ సంవత్సరం పూర్తిగా మూసివేస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది.

ఆయా ప్రదేశాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు, సెక్షన్ 144ను మళ్లీ అమలు చేయడం ప్రారంభించాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలైన ఇన్నిరోజుల తర్వాత మళ్లీ రాష్ట్రాల్లో కొత్త కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

Also Read: ఎంఐఎం చరిత్ర ఏంటి? జాతీయ పార్టీగా ఎలా ఎదిగింది?

దేశ రాజధాని ఢిల్లీలో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతిరోజు పాజిటివ్ ల సంఖ్య , మరణాల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ఢిల్లీలో 2వేలు భారీ జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలో పెళ్లిళ్లకు కేవలం 50 మంది మాత్రమే హాజరు కావాలని తెలిపింది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు