Corona Vaccine: వ్యాక్సిన్ తీసుకున్నా.. కరోనా రావడానికి కారణం ఇదేనా..?

Corona Vaccine: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు మనదగ్గర ఉన్న ముందస్తు మందు వ్యాక్సిన్లు మాత్రమే. అందుకే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. కరోనా రాకుండా వ్యాక్సిన్ మాత్రమే అడ్డుకుంటుందని భావించిన వైద్య శాస్త్రవేత్తలు టీకాలు వేసుకోవాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రపంచ దేశాలు సైతం తమ ప్రజలకు ఉచితంగా టీకాలు వేస్తున్నాయి. అయితే టీకా వేసుకున్న తరువాత కూడా కొవిడ్ సోకుతుండడం ఆందోళన కలిగించే విషయం. టీకా వేసుకున్న […]

Written By: NARESH, Updated On : September 24, 2021 9:33 am
Follow us on

Corona Vaccine: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు మనదగ్గర ఉన్న ముందస్తు మందు వ్యాక్సిన్లు మాత్రమే. అందుకే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. కరోనా రాకుండా వ్యాక్సిన్ మాత్రమే అడ్డుకుంటుందని భావించిన వైద్య శాస్త్రవేత్తలు టీకాలు వేసుకోవాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రపంచ దేశాలు సైతం తమ ప్రజలకు ఉచితంగా టీకాలు వేస్తున్నాయి. అయితే టీకా వేసుకున్న తరువాత కూడా కొవిడ్ సోకుతుండడం ఆందోళన కలిగించే విషయం. టీకా వేసుకున్న తరువాత కూడా కరోనా వైరస్ సోకడానికి కారణాలేంటనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. రెండు డోసులు వేసుకున్న తరువాత కుడా కొవిడ్ సంక్రమించడానికి ప్రధానంగా కొన్ని విషయాలపై చర్చ సాగుతోంది.

ఒక వ్యక్తి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా అతనికి కరోనా వైరస్ సోకితే ‘బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్’ గా గుర్తిస్తారు. పూర్తి వ్యాక్సినేషన్ అయిన వ్యక్తికి, టీకా తీసుకోని వ్యక్తికి వచ్చినట్లే కొవిడ్ వస్తుంది. దీంతో వ్యాక్సిన్ పనిచేయట్లేదా..? అనే అనుమానాలు వచ్చాయి. అయితే కొంత మంది వైద్యులు పరిశోధన చేసి దీనిపై క్లారిటీ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి, తీసుకోని వ్యక్తికి వచ్చే కరోనాలో తేడా ఉంటుంటుందంటున్నారు. టీకా తీసుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినా అది ప్రమాదం కాదంటున్నారు.

సాధారణంగా తలనొప్పి, దగ్గు, జ్వరం, జలుబు ఉంటే కరోనా లక్షణాలుగా వైద్యులు ధ్రువీకరించారు. ఇందులో వీటీలో తీవ్ర ప్రభావం ఉంటే కొవిడ్ టెస్ట్ చేయించుకున్నవారికి దాదాపుగా పాజిటివ్ నిర్దారణ అయింది. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో వారు పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్దారణ అయింది. అయితే టీకా తీసుకున్న వారిలో దగ్గు, జ్వరం, జలుబు కనిపించినా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఒక అధ్యయనంలో తేలింది. టీకా తీసుకోని వారితో పోలిస్తే వీరిలో 58 శాతం ప్రభావం ఉండదని తేల్చారు.

వ్యాక్సిన్ తీసుకోని వారిలో నిరంతర దగ్గు, జ్వరం ఉంటే వారు ఆసుపత్రి పాలయ్యే అవకాశం ఉందని, ఒకవేళ వ్యాక్సిన్ తీసుకొని ఈ లక్షణాలు ఉంటే ఆసుపత్రికి వెళ్లే అవసరం రాకపోవచ్చని అంటున్నారు. అంతేకాకుండా ఇది కొన్ని రోజుల పాటు మాత్రమే ఉండే వెంటనే తగ్గిపోయే అవకాశాలే ఏక్కువగా ఉన్నాయంటున్నారు. మొత్తంగా కరోనా సోకకుండా వ్యాక్సిన్ అడ్డుకోలేకపోయినప్పటికీ దాని తీవ్రత మాత్ర పెరగకుండా అడ్డుకుంటుందని చెప్పవచ్చని వైద్యులు అంటున్నారు.

ఇప్పటి వరకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో మోడెర్నా వ్యాక్సిన్ కరోనా వైరస్ రోగ లక్షణాలను 94 శాతం తగ్గించింది. ఫైజర్ వ్యాక్సిన్ 95 శాతం తగ్గించిందని వైద్యులు తెలిపారు. ఇక జాన్సన్ అండ్ జాన్సన్ 66 శాతం ఉండగా అస్ట్రాజెనకా 70 శాతం మేర లక్షణాలు రాకుండా అడ్డుకుంటుందని అంటున్నారు. రెండు టీకాలు తీసుకున్న తరువాత కూడా కరోనా తీవ్రత ఉండడంతో అదనపు బూస్టర్ టీకా అవసరం అని కొన్ని దేశాలు ప్రకటించుకుంటున్నాయి. బ్రిటన్ లోని ఇనిస్టిట్యూట్ ప్రకారం అల్పా వేరియంట్ సోకినప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే 95 శాతం పనిచేసింది. అయితే డెల్టా వేరియంట్ విషయానికొచ్చేసరికి దీని ప్రభావం 83 శాతానికి తగ్గింది.

ఒక వ్యాక్సినేషన్ పూర్తయిన తరువాత కూడా కొవిడ్ రావడానికి రోగ నిరోధక శక్తి కూడా పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ క్రమంలో వయసు ఎక్కువున్న వారిలోనూ.. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు టీకా తీసుకున్నప్పటికీ వ్యాక్సిన్ నుంచి తక్కువగా రక్షణ పొందవచ్చని అంటున్నారు.