
భారత్ లో గడిచిన 24 గంటలలో గంటకి 8 కేసుల లెక్క కొత్తగా 200 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దింతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య1600 దాటాయి, అందులో మరణించిన వారి సంఖ్య 38 కి పెరిగింది.
మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 1,637 కు చేరుకున్నాయని ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అత్యధికంగా మహారాష్ట్రలో 302 కి పైగా పాజిటివ్ కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో 11 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా1,466 క్రియాశీల కరోనా రోగులు ఉన్నారు. ఈ వ్యాధి నుండి ఇప్పటివరకు మొత్తం 133 మంది రోగులు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఒక్కరోజే 43 కరోనా కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 87గా గుర్తించారు.