ఇక నుంచి సినిమాల్ని ఆన్ లైన్ లోనే చూడాలా .?

కరోనా లాక్ డౌన్ అంటూ సినీ పరిశ్రమకి థియేటర్ లు దూరమయ్యాయి. అనూహ్య పరిణామాలతో దేశ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది . కరోనా దెబ్బకు సినిమాని ప్రేక్షకులకి చేరవేసే దారులన్నీ మూసుకు పోయాయి. సింగల్ థియేటర్స్ దగ్గర నుంచి మల్టీప్లెక్స్ థియేటర్స్ దాకా అన్నీ క్లోజ్ చేసేశారు. టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ మల్లువుడ్ , శాండల్ వుడ్ ఇలా అన్ని భాషాల చిత్రాలు విడుదలకు నోచుకోక విముక్తికోసం ఎదురు […]

Written By: admin, Updated On : April 1, 2020 3:12 pm
Follow us on

కరోనా లాక్ డౌన్ అంటూ సినీ పరిశ్రమకి థియేటర్ లు దూరమయ్యాయి. అనూహ్య పరిణామాలతో దేశ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది . కరోనా దెబ్బకు సినిమాని ప్రేక్షకులకి చేరవేసే దారులన్నీ మూసుకు పోయాయి. సింగల్ థియేటర్స్ దగ్గర నుంచి మల్టీప్లెక్స్ థియేటర్స్ దాకా అన్నీ క్లోజ్ చేసేశారు. టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ మల్లువుడ్ , శాండల్ వుడ్ ఇలా అన్ని భాషాల చిత్రాలు విడుదలకు నోచుకోక విముక్తికోసం ఎదురు చూస్తున్నాయి.

ఇక మన తెలుగు సినిమాల విషయానికి వస్తే అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం తో పాటు మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రాలు ముందు ప్రకటించిన ప్రకారమైతే ఏప్రిల్ రెండవ తారీకు విడుదల కావాల్సివుంది. అయినా విడుదలకు నోచుకోవట్లేదు వీటితో పాటు నాని – సుధీర్ బాబు నటించిన ప్రిస్టేజ్ మూవీ “వి” చిత్రం , యాంకర్ ప్రదీప్ హీరో గా నటించిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా? `, యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ లాంటి సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో నిర్మాతలు ఎక్జిబ్యూటర్లు పంపిణీదారులు మార్చ్ నెలాఖరుకు అన్నీ సర్దుకుంటాయని మొదట భావించారు . కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ప్రజలు థియేటర్లకు వచ్చేపరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర నిర్మాతలు సమావేశమై ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదలకు నోచుకోని చిత్రాలను థియేటర్స్ లో కాకుండా డైరెక్టుగా ” అమెజాన్ ప్రైమ్” ,” నెట్ ఫ్లిక్స్” ,” సన్ నెక్స్ట్” , ” ఆహా ” లాంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. better late than never