ఏపీ ఆస్పత్రుల్లో దారుణాలు.. కన్నీటి గాథలు

ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలేదు.. ఓ కరోనా రోగి ప్రాణం పోయింది.. ప్రభుత్వాసుపత్రికి సీరియస్ కండీషన్లో వచ్చిన మరో కరోనా రోగిని ఐసీయూలో వేయకుండా జనరల్ వార్డులో పడేశారు.. దీంతో అతడి ప్రాణం పోయింది. ఏపీలోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ దారుణాలు అన్నీ ఇన్నీ కావు.. ఇక్కడే కాదు.. ఏపీ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని మీడియా సాక్షిగా బయటపడుతోంది. భర్తలను కోల్పోయి చిన్న పిల్లలతో రోడ్డునపడ్డ ఆ మహిళల ఆర్తనాదాలు […]

Written By: NARESH, Updated On : April 28, 2021 1:27 pm
Follow us on

ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలేదు.. ఓ కరోనా రోగి ప్రాణం పోయింది.. ప్రభుత్వాసుపత్రికి సీరియస్ కండీషన్లో వచ్చిన మరో కరోనా రోగిని ఐసీయూలో వేయకుండా జనరల్ వార్డులో పడేశారు.. దీంతో అతడి ప్రాణం పోయింది. ఏపీలోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ దారుణాలు అన్నీ ఇన్నీ కావు.. ఇక్కడే కాదు.. ఏపీ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని మీడియా సాక్షిగా బయటపడుతోంది. భర్తలను కోల్పోయి చిన్న పిల్లలతో రోడ్డునపడ్డ ఆ మహిళల ఆర్తనాదాలు జగన్ సర్కార్ కు వినపడుతున్నాయో లేదో తెలియదు కానీ.. ఆ కన్నీటి గాథలకు ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టకుండా ఉండలేకపోతున్నారు..

ఔను.. ఏపీలో కరోనా కల్లోలమే చోటుచేసుకుంటోంది. ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ‘‘అమ్మఒడి.. విద్యాదీవెన పేరిట మాకు డబ్బులు ఇచ్చుడు ఎందుకని.. ఒక్క ఆక్సిజన్ ఇస్తే నా భర్త బతికేవాడని..’’ ఓ మహిళ కన్నీళ్లతో జగన్ సర్కార్ ను ప్రశ్నించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏపీలోని ఆస్పత్రుల్లో పరిస్థితులకు అద్దం పడుతోంది.

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఓ వైపు రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెబుతోంది. అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెబుతున్నారు.మ రి ఇలా ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందక రోగుల ప్రాణాలు ఎలా పోతున్నాయో అర్థం కావడం లేదు. ఆ మహిళలు తమ భర్తలను బతికించాలని వేడుకుంటున్న తీరు సర్కార్ కంట పడడం లేదు. రోగులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు.

ఇక ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కొరతతో ప్రైవేటును ఆశ్రయిస్తున్న వారికి అక్కడ మరిన్ని షాకులు తగులుతున్నాయి. కరోనా పరీక్షల దగ్గర నుంచి చికిత్సల వరకు ప్రైవేటు ఆస్పత్రులు రోగులను దోచుకుంటూ పీల్చి పీప్పి చేస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. అయినా చికిత్సలో నాణ్యత మాత్రం ఉండడం లేదని తేలింది.

ఏపీలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ దారుణంగా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పట్టించుకోకపోవడంతో ప్రాణాలు పోతున్నాయంటున్నారు. అరకొర సౌకర్యాలు ఉన్నా ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యులు, చికిత్సలు సరిగ్గా అందడం లేదంటున్నారు. ప్రాణభయంతో ప్రైవేటుకు పరుగులు పెడుతున్న రోగులను ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటున్నాయి.

ప్రస్తుతం కరోనాతో ప్రైవేటు ఆస్పత్రికి వెళితే మీ ఆస్తులు అమ్ముకునేదాకా వదిలేలా కనిపించడం లేదంటున్నారు. ఒక్కో సిటీ స్కాన్ కే నాలుగైదు వేలు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టుకు వేలల్లో వసూలు చేస్తున్నారు. అయినా ఫలితం వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో జనం సిటీ స్కాలకు ఎగబడుతున్నారు. ఆస్పత్రులు ఈ డిమాండ్ ను బట్టి భారీ రేట్లు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి.

ఇక ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా పలు ప్రైవేటు ఆస్పత్రులు ధనార్జేనే ధ్యేయంగా కరోనా చికిత్స అందిస్తూ దోచుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నవి బోలెడు ఉన్నాయి. రోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నాయి. తాజాగా ఏపీ విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది.

ప్రైవేటు దోపిడీకి భయపడి ప్రభుత్వాసుపత్రులకు వెళితే నిర్లక్ష్యం.. సరిగ్గా చికిత్సలు అందించలేక రోగుల ప్రాణాలు పోతున్నాయి. అరకొర సౌకర్యాలు శాపంగా మారాయి.

కరోనా పేరిట దోపిడీ చేసే ప్రైవేటు ఆస్పత్రులపై నిత్యం 104 కాల్ సెంటర్, 1902 కాల్ సెంటర్ లను ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. చార్జీలపై ఫిర్యాదు చేయాలని సూచించింది. కానీ ఫోన్లు చేస్తున్న పెద్దగా స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎంతకో కొంతకు ఇచ్చి ప్రైవేటు దోపిడీనే భరిస్తూ ఏపీ ప్రజలు ప్రాణాలను కాపాడుకుంటున్న దైన్యం కనిపిస్తోంది.