https://oktelugu.com/

Corona: ఏపీలో కరోనా కల్లోలానికి నిదర్శనం ఇదీ!

Corona: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ఆస్పత్రిలో పనిచేసే 41 మంది యువ డాక్టర్లకు కరోనా సోకింది. కరోనా తీవ్రత ఏపీలో ఎంతో తీవ్రంగా ఉందో తెలుపడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.. ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. విస్తృతంగా వ్యాపిస్తోంది. రోజుకు కేసులు 5వేలు దాటుతున్నాయి. ఇక ఏకంగా రోగులంతా వచ్చే ప్రతిష్టాత్మక రిమ్స్ ఆస్పత్రిని కరోనా ఆవహించింది. అందులో పనిచేసే 41 మంది డాక్టర్లకు కరోనా రావడం కలకలం రేపుతోంది. కడప జిల్లా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2022 / 06:59 PM IST
    Follow us on

    Corona: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ఆస్పత్రిలో పనిచేసే 41 మంది యువ డాక్టర్లకు కరోనా సోకింది. కరోనా తీవ్రత ఏపీలో ఎంతో తీవ్రంగా ఉందో తెలుపడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.. ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. విస్తృతంగా వ్యాపిస్తోంది. రోజుకు కేసులు 5వేలు దాటుతున్నాయి. ఇక ఏకంగా రోగులంతా వచ్చే ప్రతిష్టాత్మక రిమ్స్ ఆస్పత్రిని కరోనా ఆవహించింది. అందులో పనిచేసే 41 మంది డాక్టర్లకు కరోనా రావడం కలకలం రేపుతోంది.

    కడప జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఏకంగా 41మంది ఫైనల్ ఇయర్ డాక్టర్ల కు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఈ క్రమంలోనే మెడిసిన్ పరీక్షల నిర్వహణ కష్టంగా మారింది.

    రేపే పరీక్షలు ఉండడంతో కరోనా సోకిన ఫైనల్ ఇయర్ విద్యార్థులతో రాయించడానికి ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపు జరగబోయే పరీక్షల కు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రిమ్స్ కళాశాల పిన్సిపాల్ డాక్టర్ వరలక్ష్మి ఈ మేరకు కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక హాళ్లు.. ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసింది.

    ఆస్పత్రిలోని ఇంతమంది డాక్టర్లు కరోనా బారినపడడం.. రోగులు, ఇతరులకు కరోనా తీవ్రంగా ఉండడంతో రిమ్స్ యాజమాన్యం ఆసుపత్రి మొత్తం శానిటేషన్ చేయిస్తోంది.