కరోనా మూడో దశ ఉంటుందని పలువురు విశ్లేషించారు. ఇప్పటికే వయోజనులకు టీకాలు వేస్తున్న క్రమంలో ఇది పిల్లలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. సెకండ్ వేవ్ ప్రజలను ఎంతగా భయభ్రాంతులకు గురి చేసిందో తెలుసు. ప్రజల ప్రాణాలు బలిగొన్న మహమ్మారిపై అందరు గజగజ వణికారు. ప్రపంచం మొత్తం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంది. కరోనా మూడో వేవ్ పై రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి. అసలు కరోనా మూడో వేవ్ ఉంటుందా అనే అనుమానాలు సైతం వస్తున్నాయి.
ఎయిమ్స్ చీఫ్ గులేరియా మాట్లాడుతూ మూడో వేవ్ తథ్యం అన్నారు. అది కూడా రెండు మూడు నెలల్లో వస్తుందని తేల్చారు. కొందరేమో వైరస్ రూపు మార్చుకుందని చెబుతున్నారు. దానికి ఇంకా సమయం పట్టవచ్చని సూచిస్తున్నారు. అక్టోబర్-నవంబర్ నెలల వరకు మూడో వేవ్ రాదంటున్నారు. కరోనా మూడో వేవ్ గురించి రెండు రకాల సమయాలను చెబుతున్నారు పరిశోధకులు.
కర్ణాటకలో వైరాలజిస్టులు వేర్వేరుగా స్పందించారు. వారిలో ఒకరు చెప్పేదేమిటంటే కరోనా మూడో వేవ్ వస్తుందనేందుకు ఆధారాలు లేవు. మూడో వేవ్ గురించి ఎలాంటి శాస్ర్తీయమైన ఆధారాలు లేవని ఐఐఎస్సీలో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్డ్ అయిన విజయ అనే వైరాలజిస్టు తేల్చి చెబుతున్నారు.
కర్ణాటకకు చెందిన జాకబ్ అనే వైరాలజిస్టు స్పందిస్తూ దేశంలో కరోనా మూడో వేవ్ ఉండదన్నారు. కరోనా తీవ్ర స్థాయిలో తన రూపును మార్చుకుంటే తప్ప మూడో వేవ్ ఉందని పేర్కొన్నారు. ఆ మార్పు సాధ్యం కాదని మూడో వేవ్ ఉండదనేది వైరాలజిస్టుల అభిప్రాయం. డెల్టా వేరియంట్ కు డెల్టా ప్లస్ వేరియంట్ కు పెద్ద తేడాలు లేవని చెబుతున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ తో మూడో వేవ్ అనేది సాధ్యం కాదన్నారు. సెకండ్ వేవ్ లోనే డెల్టా ప్లస్ వేరియంట్ కూడా నశించిపోతుందని వైరాలజిస్టులు చెబుతున్నారు.