డేంజర్ కరోనా: ముంచుకొస్తున్న థర్డ్ వేవ్

కొవిడ్ ముప్పు ముంచుకొస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది కచ్చితంగా ప్రమాకరమే. ఓ వైపు శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. నిన్న 30 వేలకు పడిపోయిన కేసులు ఇవాళ 42 వేలకు పెరిగాయి. కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది. ఇవి ప్రమాద ఘంటికలే. కొవిడ్ రెండు విడతలు దేశాన్ని ఊపేశాయి. దేశం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. వ్యాక్సినేషన్ భారీ ఎత్తున చేపట్టిన బ్రిటన్ వంటి చోట్ల ఇప్పుడు థర్డ్ వేవ్ […]

Written By: Srinivas, Updated On : July 21, 2021 6:12 pm
Follow us on

కొవిడ్ ముప్పు ముంచుకొస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది కచ్చితంగా ప్రమాకరమే. ఓ వైపు శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. నిన్న 30 వేలకు పడిపోయిన కేసులు ఇవాళ 42 వేలకు పెరిగాయి. కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది. ఇవి ప్రమాద ఘంటికలే. కొవిడ్ రెండు విడతలు దేశాన్ని ఊపేశాయి. దేశం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. వ్యాక్సినేషన్ భారీ ఎత్తున చేపట్టిన బ్రిటన్ వంటి చోట్ల ఇప్పుడు థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి.

మన దేశంలో కొన్ని స్టేట్లలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేరళలో థర్డ్ వేవ్ మొదలైందనే అనుమానాలు వస్తున్నాయి. మహారాష్ర్టలో కూడా రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుదల కనిపించింది. రోజువారీ కేసులు 8 వేల నుంచి 10 వేల మధ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సెకండ్ వేవ్ లో కేసులు ఏ విధంగా పెరిగాయో తెలిసిందే. థర్డ్ వేవ్ లో కేసులు విపరీతంగా పెరిగి ప్రజలను అతలాకుతలం చేసింది.

రద్దీగా ఉండే పట్టణాల్లోని ప్రజలు ఇప్పటికే కొవిడ్ ప్రభావానికి గురి కావడంతో వ్యాప్తి తీవ్రత తగ్గవచ్చు. ఢిల్లీలో దాదాపు 70 శాతం మందిలో యాంటీబాడీలు కనిపిస్తున్నట్లు సిరో సర్వేలు చెబుతున్నాయి. ముంబయిలోటీఐఎఫ్ఆర్ టీమ్ నిర్వహించిన సర్వేలో 80శాతం మంది వైరస్ ప్రభావానికి గురైనట్లు గుర్తించారు. ఇప్పటికే బ్రెజిల్, కొలంబియా వంటి దేశాల్లో విడతలుగా వైరస్ విజృంభించినట్లు గ్రాఫ్ లు చెబుతున్నాయి.

థర్డ్ వేవ్ వచ్చేందుకు అవకాశాలున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. రోగ నిరోధక శక్తిని తప్పించుకునేందుకు మ్యూటెంట్ వస్తే పరిస్థితి కష్టమే అని తెలిపారు. సెకండ్ వేవ్ కు మించి కేసులు రావొచ్చన్నారు. థర్డ్ వేవ్ ను అంచనా వేయడం కష్టమని కర్ణాటక కొవిడ్ నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ దేవిశెట్టి పేర్కొన్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు వదిలేసి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే వారిని ప్రభుత్వాలు, మందులు, టీకాలు కాపాడలేవన్నారు.