Corona restriction in AP : ప్రపంచమంతా ఇప్పుడు కరోనా కల్లోలంతో ఆగమాగమవుతోంది. దేశాన్ని కరోనా సునామీ తాకడానికి రెడీ అవుతోంది. రోజు 1.60 లక్షల కేసులతో కరోనా భయపెడుతోంది. కొత్తగా రూపాంతరం చెందిన ఒమిక్రాన్ కూడా భయపెడుతోంది. అందుకే ఏపీ ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. తాజాగా జగన్ ప్రభుత్వం ఏపీలో కోవిడ్ ఆంక్షలు అమలుచేసింది.
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో రాత్రిళ్లు బయట తిరగడానికి వీళ్లేదు. ఈ మేరకు నైట్ కర్ఫ్యూ విధిస్తే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది.
త్వరలో వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడపాలని.. మాస్క్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
కోవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విస్తరణ.. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కోవిడ్ లో ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందులను మార్చి హోం కిట్ రూపొందించాలన్నారు. మందు నిల్వలపై సమీక్షించారు. అవసరం మేరకు వాటిని కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
* ఏపీలో కోవిడ్ ఆంక్షలివీ..
-ఏపీలో నైట్ కర్ఫ్యూ.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశం
-థియేటర్లలో 50శాతం ఆక్యూపెన్సీ: థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని ఆదేశం.. మాస్క్ తప్పనిసరి చేయాలని ఆదేశం..
-దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో భౌతికదూరం పాటించేలా మాస్క్ ధరించేలా ఆంక్షలు..
-బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్ డోర్స్ లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశం..
-బస్సు ప్రయాణికులు కూడా మాస్క్ ధరించాలి. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలి.