బీజేపీ డ్యూయెల్‌ రోల్‌..: అటు రైతులతో, ఇటు సీఎంలతో చర్చలు

ఇన్ని రోజులు తిరుగులేని రాజకీయ పార్టీగా.. తిరుగులేని నేతగా దూసుకెళ్లిన బీజేపీ.. ఆ పార్టీ నుంచి ఎన్నికైన ప్రధాని మోడీకి ఒక్కసారిగా రైతుల నుంచి ధిక్కార స్వరం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉవ్వెత్తున నిరసనలతో రైతులు దూసుకెళ్తున్నారు. ఢిల్లీ వేదికగా పోరాడుతూ కేంద్ర సర్కార్‌‌కు సెగ తగిలిస్తున్నారు. 22 రోజులుగా పట్టిన పట్టు వీడకుండా నినదిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. రోజురోజుకూ రైతు సంఘాల ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. Also Read: అప్పుడే ఎన్నికలకు […]

Written By: Srinivas, Updated On : December 18, 2020 10:11 am
Follow us on


ఇన్ని రోజులు తిరుగులేని రాజకీయ పార్టీగా.. తిరుగులేని నేతగా దూసుకెళ్లిన బీజేపీ.. ఆ పార్టీ నుంచి ఎన్నికైన ప్రధాని మోడీకి ఒక్కసారిగా రైతుల నుంచి ధిక్కార స్వరం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉవ్వెత్తున నిరసనలతో రైతులు దూసుకెళ్తున్నారు. ఢిల్లీ వేదికగా పోరాడుతూ కేంద్ర సర్కార్‌‌కు సెగ తగిలిస్తున్నారు. 22 రోజులుగా పట్టిన పట్టు వీడకుండా నినదిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. రోజురోజుకూ రైతు సంఘాల ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది.

Also Read: అప్పుడే ఎన్నికలకు రెడీ అవుతున్న బీజేపీ

అగ్రి చట్టాలపై ప్రారంభంలో ఒక్క పంజాబ్‌లోని రైతులు మాత్రమే స్పందించారు. వారు మాత్రమే నిరసన గళం వినిపించారు. ఇప్పుడు హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల రైతులు కూడా వీరికి తోడయ్యారు. తొందరలోనే ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు.. రైతు సంఘాలకు ప్రతిపక్షాలు కూడా చేదోడుగా నిలుస్తుండడంతో పోరాటం బలపడుతోంది. మొదట్లో ఈ ఉద్యమాన్ని లైట్‌ తీసుకున్న కేంద్రం ఇప్పుడు రియాక్ట్‌ కావాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇందులో భాగంగానే ఇప్పటికే నాలుగు సార్లు కేంద్ర మంత్రులు రైతులతో చర్చలు జరిపారు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు, ఎట్టి పరిస్థితిల్లోనూ కుదరదంటూ కేంద్రం ఎవరి పట్టుదలతో వారున్నారు. దాంతో కేంద్రానికి ఇబ్బందిగా తయారైంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాస్త్రజ్ఞులు, నిపుణులతో చర్చలు మొదలుపెట్టింది. వ్యవసాయ చట్టాలు చేయటానికి ముందు చేయాల్సిన పనిని ఇప్పుడు చేస్తోంది.

Also Read: 10వేల సాయం ఇచ్చారు కానీ.. వివరాలే లేవంట..!

అంతేకాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితోనూ హడావుడిగా చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాల్లో రైతు ఉద్యమ ప్రభావం తెలుసుకోవటం, ఉద్యమానికి ప్రభుత్వం తరపున మద్దతు దక్కకుండా చేయటమనే వ్యూహంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ రంగంలోకి దింపారు. మరో రెండు రోజుల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తోనూ అమిత్‌ షా భేటీ కానున్నట్లు సమాచారం. తర్వాత తమిళనాడు సీఎం పళనిస్వామిని కూడా పిలవబోతున్నట్లు సమాచారం. అంటే ఓవైపు రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే.. ఆ ఉద్యమాన్ని ఢిల్లీ వరకే పరిమితం చేయాలని బీజేపీ చూస్తోంది. అందుకే.. బీజేపీకి వెలుపల నుంచి మద్దతుగా నిలుస్తున్న సీఎంలను ఒక్కొక్కరిని పిలిచి చర్చిస్తున్నట్లు అర్థమవుతోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్