
సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. గంధపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. అనుకున్న ప్రకారం ఈ ఆగస్టుకు సినిమా వచ్చేయాలి. కానీ.. కొవిడ్ కారణంగా డిసెంబర్ కు వాయిదా వేసారనే టాక్ వచ్చింది. అయితే.. ఇప్పుడు మరో అప్డేట్ చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా షూట్ ఇప్పటి వరకు సగం కూడా పూర్తికాలేదట. ఇంకా.. చాలా సినిమా షూట్ చేయాల్సి ఉందట. ఇటు చూస్తే.. కొవిడ్ కండీషన్లో షూటింగులన్నీ ప్యాకప్ చెప్పేశాయి. మళ్లీ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో? ఎప్పుడు షూటింగులు మొదలు పెడతారో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. వచ్చే నెలరోజుల్లోనైతే అవకాశమే లేదు. ఆ తర్వాత ఏంటన్నది చూడాలి.
ఇటు చూస్తే.. బన్నీ సినిమా వచ్చి రెండో సంవత్సరం నడుస్తోంది. ఈ సినిమా కంప్లీట్ కావడానికి ఇంకా చాలా సమయం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ పెట్టిన పెట్టుబడికి వడ్డీ కొండలా పెరిగిపోతూనే ఉంది. అందువల్ల పుష్పను బాహుబలి మాదిరిగా రెండు భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
బాహుబలిని కూడా రాజమౌళి మొదట ఒకే సినిమాగా అనుకున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ పెరిగిపోవడం, టైమ్ డ్రాగ్ అయిపోయిన కారణాలతో రెండు భాగాలుగా తెరకెక్కించాడు. అయినప్పటికీ.. నా దృష్టిలో బాహుబలి ఒకే సినిమా అన్నాడు జక్కన్న. ఇక, రెండు భాగాలతో రెట్టింపు కలెక్షన్లు కూడా వచ్చేశాయి. ఇప్పుడు ఇదే సూత్రాన్ని పుష్పకు అప్లై చేయాలని చూస్తున్నారని టాక్.
ఏం చేద్దా? ఎలా చేద్దాం? అని డిస్కషన్ నడిపిస్తున్నారట మేకర్స్. షూట్ ఇంకా చాలా మిగిలి ఉన్నందున మొదటి భాగం కథను మరింతగా పెంచేసి.. త్వరగా కంప్లీట్ చేసి.. విడుదల చేయాలని చూస్తున్నారట. దీని సాధ్యాసాధ్యాలపై.. ప్లాన్ ఏమాత్రం వర్కవుట్ అవుతుందన్నదానిపై సీరియస్ గా చర్చిస్తున్నారట. ఈ ప్రతిపాదన విన్న నిర్మాతలు.. నిర్ణయం మొత్తాన్ని దర్శకుడికే వదిలేశారట. సుకుమార్ ఏది చెబితే అదే ఫైనల్ అన్నారట. మరి, సుక్కూ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు? పుష్ప ఒక్క సినిమానా? రెండు సినిమాలా? అన్నది చూడాలి.