తెలంగాణాలో కరోనా కేసులపై మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైందన్న ఆయన ప్రస్తుతం ఇతర దేశాల, రాష్ట్రాల నుండి ప్రజలు వస్తున్నందున వారికి ఎక్కువ శాతం కరోనా ఉన్నందు వలన పల్లెలు,పట్టణాలు క్షేమంగా ఉండే పరిస్థితి లేదని అన్నారు. కరోనా ఇప్పుడే పోయేది కాదని ఆయన పేర్కొన్నారు.
మొదటి రెండు నెలలు లాక్ డౌన్ విషయంలో సీరియస్ గా వ్యవహరించాం కాబట్టే కేసులు ఎక్కువ స్థాయిలో విస్తరించ లేదని అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కరోనాను లైట్ గా తీసుకోవద్దు.. జూన్,జూలై నెలలో ఎక్కువగా కరోనా విస్తరించే అవకాశం ఉందని అన్నారు. కరోనను అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదన్న ఆయన, ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలని అన్నారు.