
తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ.. ఈ రోజుకి 20వేల మార్క్ ని తాకింది. ఈరోజు కొత్తగా 874 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 20,246కు చేరింది. గడచిన 24 గంటల్లో ఒక్క చెన్నైలోనే 618 మందికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,776 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క రోజు వ్యవధిలో మరో 9 మంది కరోనా వల్ల చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 154కు పెరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు కరోనా నుంచి కోలుకొని 11,313 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 85 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,330కి చేరింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 111 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 345 మందికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 156 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఉన్నవాళ్లలో 2,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,037 మంది డిశ్చార్జి అయ్యారు. 60 మంది మరణించారు. 777 మంది చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య 1, 65, 799 కి చేరింది. రికవరీ రేటు 42.89 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 89,987 మంది వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యం పొందుతుండగా, 71,105 మంది నయమై డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లోనే 3,414 మంది రికవరీ అయ్యారు.